Share News

చౌడేశ్వరి దేవి ఆలయ నిర్మాణానికి సహకారం

ABN , Publish Date - Sep 22 , 2026 | 11:34 PM

చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ నిర్మాణా నికి తనవంతు సహకారం అందిస్తానని స్థానిక ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు.

చౌడేశ్వరి దేవి ఆలయ నిర్మాణానికి సహకారం
బిజినేపల్లిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినులతో సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి

- ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి

కందనూలు/ బిజినేపల్లి/ తిమ్మాజిపేట, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ నిర్మాణా నికి తనవంతు సహకారం అందిస్తానని స్థానిక ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. బిజినేపల్లి మండల కేంద్రంలో పునర్‌ నిర్మాణంలో ఉన్న చౌడే శ్వరి దేవి ఆలయ పనులను మంగళవారం యాదవ సంఘం సభ్యులతో కలిసి పరిశీలించారు. తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. ఆలయం పక్కనే ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్న త పాఠశాలను సందర్శించి అక్కడి సమస్యలను విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. కార్య క్రమంలో కాంగ్రెస్‌ నాయకులు కొండ నాగేష్‌, మండల అధ్యక్షుడు మిద్దె రాములు, సర్పం చులు మిద్దె ఇందిర, జాలం నాగయ్య, మాజీ స ర్పంచులు తిరుపతయ్య, అమృత్‌రెడ్డి, వెంకట స్వామి, ఉప సర్పంచ్‌ మహేష్‌, కత్తె ఈశ్వర్‌ తదితరులు ఉన్నారు.

ఫ తిమ్మాజిపేట మండలం అమ్మపల్లికి బుద్దసముద్రం కాలనీ ముఖ ద్వారం నుంచి చేపట్టనున్న పనులకు మంగళవారం ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి శంఖుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రోడ్ల సమస్య దశల వారీగా పరిష్కరి స్తామన్నారు. అమ్మపల్లి సర్పంచ్‌ గంగుల తిరు పతిరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల శాఖ అధ్యక్షు డు చిలుక వివేక్‌రెడ్డి, నాయకులు మల్లయ్య గౌడ్‌, నాగసాయిలు, భాస్కర్‌రెడ్డి, జంగిరెడ్డి, ఆంజనేయులు, సాయిరెడ్డి, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

ఫ నాగర్‌కర్నూల్‌లో మిషన్‌ భగీరథ పంపుహౌజ్‌ వద్ద ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి మంగళవారం అధికారులతో సమీక్షించారు. తక్కువ నీటి సరఫరాకు కారణాలను లైన్‌మె న్లు, వాటర్‌మెన్లు, సిబ్బందిని అడిగి తెలుసు కున్నారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలుగకుండా అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

J

Updated Date - Sep 22 , 2026 | 11:34 PM