తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సునీల్ గౌడ్ మూడోసారి విజయం
ABN , Publish Date - Mar 22 , 2026 | 05:36 AM
తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్- 2026 ఎన్నికల్లో ప్రస్తుత వైస్ ఛైర్మన్ కుంచ సునీల్‌గౌడ్ మూడోసారి ఘనవిజయం సాధించారు.
హైదరాబాద్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్- 2026 ఎన్నికల్లో ప్రస్తుత వైస్ ఛైర్మన్ కుంచ సునీల్‌గౌడ్ మూడోసారి ఘనవిజయం సాధించారు. హాట్రిక్ సాధించిన సునీల్ గౌడ్‌కు హైకోర్టు సీనియర్ న్యాయవాదులు, హైకోర్టు బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు అభినందించారు. మొదటిసారి 2011లో ఆయన బార్ కౌన్సిల్ మెంబర్‌గా గెలిచారు. ఆయన సేవలను గుర్తిస్తూ 2018లో రెండోసారి వైస్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. తాజా ఎన్నికల్లోనూ మరోసారి విజయం సాధించారు.