Share News

kumaram bheem asifabad- వేసవి వేళ.. పిల్లలు భద్రం

ABN , Publish Date - Apr 14 , 2026 | 10:42 PM

విద్యాసం స్థలకు త్వరలో వేసవి సెలవులు రానున్నా యి. తమ ఊళ్లకు వెళ్లి ఉత్సాహంగా గడపాలని అనుకుంటారు. సరదా కోసం మిత్రులతో కలిసి చెరువులు, వాగులు, కాలువల వద్దకు ఈతకు వెళ్లి గురైన సంఘటనలు గతంలో చాలా ఉన్నాయి. వాటి నుంచి పిల్లలను కాపాడుకోవడానికి తల్లిదండ్రులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈత సరాదా పిల్లల ప్రాణాలను బలి తీసుకొంటోంది.

kumaram bheem asifabad- వేసవి వేళ.. పిల్లలు భద్రం
ఈత కొడుతున్న చిన్నారులు

- తల్లిదండ్రులకు తప్పని కడుపుకోత

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): విద్యాసం స్థలకు త్వరలో వేసవి సెలవులు రానున్నా యి. తమ ఊళ్లకు వెళ్లి ఉత్సాహంగా గడపాలని అనుకుంటారు. సరదా కోసం మిత్రులతో కలిసి చెరువులు, వాగులు, కాలువల వద్దకు ఈతకు వెళ్లి గురైన సంఘటనలు గతంలో చాలా ఉన్నాయి. వాటి నుంచి పిల్లలను కాపాడుకోవడానికి తల్లిదండ్రులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈత సరాదా పిల్లల ప్రాణాలను బలి తీసుకొంటోంది. ప్రాజెక్టులు, చెరువ ుల్లో ఈత కొట్టేందుకు వెళ్తున్న వారు విగత జీవులుగా మారి తల్లిదం డ్రులకు గర్భకోశాన్ని మిగిలిస్తున్నారు. అవగాహన లేమితో ప్రాజెక్టులు, చెరువుల లోతును సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. నీటిలో పెరిగిన నాచు, మొక్కలు కాళ్లకు తగిలి నీటిలో ఊపి రాడక మృతి చెందుతున్నారు. పిల్లలు ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్త తీసుకోవల్సిన అవసరం ఉంది.

- సరదాగా వెళ్లి..

వేసవి కాలం సెలవుల రోజుల్లో సరదాగా ఈతకు వెళ్లి మృత్యువాత పడుతున్న వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. ప్రాజెక్టులు, చెరువులలో ఈతకు వెళ్లి మునిగి ప్రమాదాలకు గురై మృతి చెందుతున్నా రు. దీంతో తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిలి స్తున్నారు. అవగాహన లేమి, నీటి లోతు తెలియక పోవడం, వచ్చిరాని ఈత, స్నేహితుల మధ్య సరదగా పెట్టుకునే పోటీలు ఈ తరహ సంఘటనలకు కారణమవు తున్నాయి. వేసవి సెలవుల్లో పిల్లలు ఎక్కువగా ఈతకు వెళ్లే ఆవకాశం ఉండటంతో ప్రాజె క్టులు, చెరువుల వద్ద కాపలాదారులను ఏర్పాటు చేయాలి.

- వేసవి తాపం నుంచి..

వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం గ్రామీణు లతో పాటు పట్టణ ప్రాంతాల్లోను చాలా మంది పిల్లలు ఈత కొట్టేందుకు వెళ్తుంటారు. బావులు, చెరువుల వద్దకు వెళుదామంటే తల్లిదండ్రులు కోప్పడుతారనే భయంతో కొందరు చెప్పకుండానే స్నేహితులతో కలిసి ప్రమాదాల బారిన పడుతుం టారు. ఈ విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత గా ఉండాలి. వేసవిలో తల్లిదండ్రులు తమ పిల్లలను ఓ కంట కనిపెట్టి ఉండాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లే పిల్లల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. స్నేహితులతో ఈతకు వెళ్లే ముందు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని సూచించాలి. ఈతరాని పిల్లలపై మరింత జాగ్రత్తగా వ్యవహ రించాలి. ఎందుకంటే ఈత సరదా, తోటి మిత్రుల ప్రోత్సాహం వారిని నీటివైపు లాక్కొని పోతుంది. ఈత సరదా ఉన్న పిల్లల ఆసక్తిని గమనించి తామే స్వయంగా స్వీయ పర్యవేక్షణలో నేర్పించడం మంచిది. సాద్యమైనంత వరకు స్నేహితులతో ఈతకు పంపకపోవడమే మంచిది. కాగా జలాశయాల్లో ఈత కొట్టేందుకు పైనుంచి దూకే సమయంలో కాళ్లు మొదటగా నీటిని తాకేలా చూసుకోవాలి. తలకిం దులుగా దూకడం ప్రమాదకరం. క్వారీ గుంతల అడుగు భాగంలో బండలు, రాళ్లు ఉంటాయి. లోతును ముందుగానే అంచనా వేయకపోతే నీటమునిగే ప్రమాదం ఉంది. ఒకరిపై మరొకరు దూకితే పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది.

తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి..

- సత్యనారాయణ, డాక్టర్‌,ఆసిఫాబాద్‌

తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలను ఓ కంట కనిపెట్టి ఉండాలి. సాధ్యమైనంత వరకు స్నేహితులతో ఈతకు పంపకపోవడమే మం చిది. పిల్లలకు ఈతపై ఆసక్తి ఉంటే స్వయంగా స్వీయ పర్యవేక్షణలో నేర్పించాలి. ఈతకు వెళ్లి ప్రమాదానికి గురైతే బాదితుడిని ఒడ్డుకు చేర్చిన తర్వాత వెల్లకిలా పడుకోబెట్టాలి అవసరమైతే కృత్రిమ శ్వాస అందిం చాలి. చాతిపై చేతులతో వత్తాలి. దీని వల్ల శ్వాస పెరుగుతుంది. తర్వాత దగ్గరలోని ఆసుపత్రికి తీసుకు వెళ్లి చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలి.

Updated Date - Apr 14 , 2026 | 10:42 PM