kumaram bheem asifabad- ఎండాకాలం.. ఆరోగ్యం పైలం
ABN , Publish Date - Mar 29 , 2026 | 10:50 PM
సూరీడు నిప్పులు కక్కుతున్నాడు. వారం రోజులుగా విపరీతమైన ఎండలతో ప్రజలు సతమతమవుతున్నారు. పగటి పూట బయటకు వెళ్లాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. గడిచిన నాలుగైదు రోజులుగా జిల్లాలో సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. ఉదయం పూట, రాత్రంతా చల్లగా ఉంటున్న వాతావరణం మధ్యాహ్నం విపరీతంగా వేడెక్కుతోంది. రాత్రి 8 గంటలు గడిస్తే తప్ప ఎలాంటి మార్పులు ఉండడం లేదు. ఉదయం 10 గంటలకే రోడ్లు, రహదారులు వేడెక్కుతుండడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతు న్నారు.
- పిల్లలపై తల్లిదండ్రులు మరింత శ్రద్ధ చూపాలి
వాంకిడి, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): సూరీడు నిప్పులు కక్కుతున్నాడు. వారం రోజులుగా విపరీతమైన ఎండలతో ప్రజలు సతమతమవుతున్నారు. పగటి పూట బయటకు వెళ్లాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. గడిచిన నాలుగైదు రోజులుగా జిల్లాలో సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. ఉదయం పూట, రాత్రంతా చల్లగా ఉంటున్న వాతావరణం మధ్యాహ్నం విపరీతంగా వేడెక్కుతోంది. రాత్రి 8 గంటలు గడిస్తే తప్ప ఎలాంటి మార్పులు ఉండడం లేదు. ఉదయం 10 గంటలకే రోడ్లు, రహదారులు వేడెక్కుతుండడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతు న్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండలు పెరుగడంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు మొదల య్యాయి. ఉదయం 8 నుంచి మద్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు జరుగుతున్నాయి. వేకువజామునే నిద్రలే చిన పిల్లలు ఉరుకులు పరుగులతో బడికివెళ్తారు. మధ్యాహ్నం ఇళ్లకు చేరుకుంటారు. ఎండలో తిరిగి ఆరోగ్యాన్ని పాడుచేసుకోకుండా ఈతకు వెళ్లి ప్రాణం మీదకు తెచ్చుకోకుండా పిల్లల తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవా లి. వారి అలవాట్లు, ఆహారం, ఆరోగ్యంపై దృ ష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- ఆహారం విషయంలో...
ఉదయం బడికి వెళ్లాలంటే పిల్లలు త్వ రగా సిద్ధమవ్వాలి. ఈ సమయంలో పిల్లలు తీసుకునే ఆహారం తెలికపాటిదై ఉండాలి. త్వరగా జీర్ణమయ్యే ఆల్పాహారం ఇవ్వాలి. పండ్లు, పండ్ల రసాలు, రాగిజావ తాగిస్తే మంచిది. మధ్యాహ్నం ఇంటికి చేరుకున్న తర్వాత ద్రవపదార్థాలు ఇవ్వాలి. తర్వాత రెండు గంటల పాటు పడుకోబెట్టాలి. తర్వాత ఆటలు ఆడించాలి. కాగా పాఠశాల నుంచి తీసుకొచ్చే సమయంలో గొడుగు వాడటం లేదా టోపీలు పెట్టడం తప్పనిసరి. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల సమయం లో అతినీలలోహిత కిరణాలు భూమిపై పడ తాయి. ఎండలో తిరిగితే చర్మం దెబ్బతింటుం ది. వీలైనంత వరకు నీడలో ఉండడం మంచిది. వేసవి తాపాన్ని తట్టుకో వడం చెరువులు, వ్యవసాయ బావుల్లో ఈతకు వెళ్లి ప్రమదాల బారిన పడుతుంటారు. ఇలా వెళ్ల కుండా తల్లిదండ్రులు వారికి అవగాహన కల్పించాలి. వీలైతే దగ్గరుండి తీసుకెళ్లాలి. సెల్‌ఫోన్ అధికంగా చూసే ప్రమాదం ఉంది. దీనికి కట్టడి చేయాలి. నీతి కథలు, పద్యాలు, స్ఫూర్తినిచ్చే వ్యక్తుల జీవిత చరిత్రలు చది వించాలి.
జిల్లాలో ఉష్ణోగ్రత ఇలా..
జిల్లాలో ఆదివారంనమోదైన ఉష్ణోగతల వివ రాలు ఇలా ఉన్నాయి. ఆసిఫాబాద్, కెరమెరి మండలాల్లో గరిష్ఠంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత లు నమోదయ్యాయి. రెబ్బెన మండలం వంకు లం, సిర్పూర్(టి), కాగజ్‌నగర్ మండలంలో 41.4, కెరమెరి మండలం ధనోరాలో 41.2, తిర్యాణిలో 41.0, పెంచికలపేట, దిహెగాం మం డలాల్లో 40.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమో దయ్యాయి. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాల ని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నీళ్లు ఎక్కవగా తాగాలి
- వినోద్, వైద్యాధికారి, వాంకిడి
వేసవి దృష్ట్యా పిల్లలు, పెద్దలు ఎక్కువగా నీరు తీసుకోవాలి. పిల్లలు మధ్యాహ్నం బయ టకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండేలా చూడాలి. ఆహారం విషయంలో జాగ్రత ్తలు తీసుకోవాలి. పండ్లు, పడ్ల రసాలు ఇక్కువగా ఇవ్వాలి. బ యటికి వెళ్లేటప్పుడు గొడుగు, లేదా టోపీలు, తెల్లరుమాలు ధరించి ఎండబారిన పడ కుండా చూసుకోవాలి.