Share News

సుమన్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడు

ABN , Publish Date - Feb 18 , 2026 | 12:00 AM

రౌడీ, గుండాయిజంతో మాజీ పార్లమెంట్‌ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడని రాష్ట్ర కార్మిక, మైనింగ్‌ శాఖ మంత్రి వివేక్‌వెంక ట స్వామి అన్నారు.

సుమన్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడు

మంత్రి వివేక్‌ వెంకటస్వామి

చెన్నూరు, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి) : రౌడీ, గుండాయిజంతో మాజీ పార్లమెంట్‌ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడని రాష్ట్ర కార్మిక, మైనింగ్‌ శాఖ మంత్రి వివేక్‌వెంక ట స్వామి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే బాల్క సు మన్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడని ఆరోపించారు. అప్పటి మున్సి పాలిటీ ఎన్నికల్లో కౌన్సిలర్‌లుగా పోటీలో ఉన్న అభ్యర్ధులను భయ బ్రాం తులకు గురి చేశాడని, ఎవరిని నామినేషన్‌ వేయనీయకుండా కౌన్సిలర్‌ స్థానాలను ఏకగ్రీవం చేసిన చరిత్ర ఆయనదేనని ఆరోపించారు. మంగళ వారం క్యాతనపల్లి మున్సిపాలిటీలో పాలకవర్గ ప్రమాణ స్వీకారం, చైర్‌ప ర్సన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎన్నిక సందర్భంగా ఎంపీ వంశీకృష్ణతో కలిసి ఎక్స్‌ అఫీషియో మెంబర్లుగా చైర్మన్‌ ఎంపిక కోసం మున్సిపాలిటీకి వెళ్తున్న క్ర మంలో తమ వాహనాలపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ఒక వీధి రౌ డీలాగా రాళ్లు, ట్రాఫిక్‌ వస్తువులతో దాడులు చేశాడన్నారు. ప్రశాంతంగా ఉన్న క్యాతనపల్లిలో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించాడని వాపోయారు. మున్సిపాలిటీలో తమ కౌన్సిలర్‌ అభ్యర్ధులపై వారు దాడులు చేస్తేనే బ యటకు వెళ్లి వచ్చామన్నారు. సుమన్‌పై పోలీసులు కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఓడిపోయానన్న ప్రష్టేష న్‌లో మాజీ ఎమ్మెల్యే సుమన్‌ దాడులకు పాల్పడుతున్నాడని, రౌడీయి జాన్ని మానుకోకపోతే నియోజకవర్గప్రజలే రానున్న రోజుల్లో తగిన గుణ పాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Feb 18 , 2026 | 12:00 AM