Share News

డంప్‌తో ఉక్కిరి బిక్కిరి

ABN , Publish Date - Oct 12 , 2026 | 11:28 PM

మంచి ర్యాల నగరాన్ని చెత్త సమస్య వీడటం లేదు. ప్రజలు అనారోగ్యాల భారిన పడుతున్నా సంబంధిత అధికారు లు పట్టనట్లు వ్యవహరిస్తుండటం తీవ్ర విమర్శలకు దా రి తీస్తోంది. మునిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో వెలు వడే చెత్తను జనావాసాల సమీపంలో డంప్‌ చేస్తుండటంతో ప్రజలు దుర్వాసన భరించలేక పోతున్నారు. న

డంప్‌తో ఉక్కిరి బిక్కిరి

‘చెత్త’ సమస్య తీరేదెన్నడు..?

-మంచిర్యాలను కమ్మేస్తున్న కాలుష్యం

-జనావాసాల సమీపంలో మునిసిపల్‌ వ్యర్థాల డంపింగ్‌

-దట్టమైన పొగలతో రోగాలభారిన ప్రజలు

మంచిర్యాల, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): మంచి ర్యాల నగరాన్ని చెత్త సమస్య వీడటం లేదు. ప్రజలు అనారోగ్యాల భారిన పడుతున్నా సంబంధిత అధికారు లు పట్టనట్లు వ్యవహరిస్తుండటం తీవ్ర విమర్శలకు దా రి తీస్తోంది. మునిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో వెలు వడే చెత్తను జనావాసాల సమీపంలో డంప్‌ చేస్తుండటంతో ప్రజలు దుర్వాసన భరించలేక పోతున్నారు. నగర పాల క సంస్థ కోసం ప్రత్యేకంగా డంప్‌ యార్డు ఏర్పాటు చే యకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. పారిశుధ్య సిబ్బంది నిత్యం ఇండ్ల నుంచి సేకరించిన చెత్త, వ్యర్థపదార్థాలను కార్పొరేషన్‌ పరిధిలోని 19వ డివి జన్‌ అండాళమ్మ కాలనీకి తరలిస్తుంటారు. కాలనీలోని నివాస గృహాలకు అత్యంత సమీపంలో అతికొద్ది స్థలం లో ఏర్పాటు చేసిన డంప్‌ యార్డులో నగరం లో వెలు వడిన చెత్తనంతటినీ వేస్తుండటంతో ఆ ప్రాంత మంతా తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోంది. దీంతో ప్రజలు తరుచుగా అనారోగ్యం పాలవుతున్నా పట్టించుకొనే వారు కరువ య్యారు. మున్సిపాలిటీకి ప్రత్యేక డంప్‌ యార్డు ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా నగర వాసులు కోరుతున్నా దానికి మోక్షం లభించడం లేదు. ఫలితంగా ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

శాశ్వత పరిష్కారం ఎప్పుడో..?

నగరంలో వెలువడే చెత్తను కొంతకాలం పాటు వేం పల్లి సమీపంలో డంప్‌ చేసినప్పటికీ అక్కడి ప్రజల అ భ్యంతరంతో నిలిపివేశారు. దీంతో తిరిగి అండాళమ్మ కా లనీ సమీపంలోని తాత్కాలిక డంప్‌ యార్డులోనే చెత్త ను వేస్తున్నారే తప్ప....శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయడం లేదనే విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. అండాళమ్మ కాలనీ సమీపంలోని జాలా గుట్టపై ఉన్న డంప్‌ యార్డులో నగరంలోని నిత్యం సేకరి స్తున్న 45 మెట్రిక్‌ టన్నుల మున్సిపాలిటీ చెత్తతోపాటు చికెన్‌ సెంటర్ల వ్యర్థ పదార్థాలు పేరుకుపోతుండటంతో మున్సిపల్‌ సిబ్బంది వారానికోసారి కాల్చి వేస్తున్నారు. వ్యర్థ పదార్థాలు కావడంతో అవి కాలే సమయంలో దట్టమైన నల్లని పొగలతోపాటు, తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో ఆ ప్రాంత ప్రజలు తరుచుగా రోగాల బారిన పడుతున్నారు. నగర పరిదిలో డంప్‌ యార్డు ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ స్థలాలు ఉన్నప్పటికీ వాటి పై అధికారులు ధృష్టిసారించకపోవడంతో శాశ్వత పరి ష్కారానికి నోచుకోవడం లేదు. నల్లటి పొగలు అండాళ మ్మ కాలనీతోపాటు సమీపంలోని గ్రీన్‌ సిటీ, పవర్‌ సిటీ కాలనీ, రంగంపేట ప్రాంతాల్లో వ్యాపిస్తుండటంతో ప్రజ లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్త తగులబెడు తున్న ప్రాంతానికి సమీపంలో మిషన్‌ భగీరథ నీటి ట్యాంకు, స్పోర్ట్‌ క్లబ్‌, ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం ఉన్నాయి. దట్టమైన పొగల కారణంగా పాఠశా ల విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.

కాలనీ వాసుల ఆందోళన....

మునిసిపాలిటీ వ్యర్థాలౄను అండాళమ్మ కాలనీలోని నివాస గృహాల సమీపంలో జాలా గుట్ట వద్ద పడవేస్తుండటం, చెత్తను సిబ్బంది కాల్చివేస్తుండటంతో దట్టమైన పొగలు కాలనీని ఆవహించడమే కాకుండా అందులో నుంచి వస్తున్న దుర్వాసన కారణంగా అక్కడి ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పొగలు, దుర్వాసన కారణంగా తాము ఆస్తమా వ్యాధికి గురికావలసి వ స్తుందని, శ్వాసకోశ సమస్యలు ఏర్పడుతున్నాయని కాల నీ వాసులు ఆందోళన చెందుతున్నారు. గతంలో పలు మార్లు కాలనీ వాసులు మూకుమ్మడిగా మున్సిపల్‌ వాహనాలను అడ్డుకొని, చెత్త డంప్‌ చేయకుండా నిలువ రించారు. చెత్తను డంప్‌ చేయడానికి వాహనాలు వెళ్లకుండా క్వారీ రోడ్డులో అడ్డంగా పెద్ద కందం కూడా త వ్వారు. ఈ విషయమై స్థానిక ప్రజలు మున్సిపల్‌ అధి కారులు, ప్రజా ప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది.

ఎన్జీటీ ఆదేశాలూ బేఖాతర్‌....

తమ సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడంతో ఆయా కాలనీల వాసులు చెన్నైలోని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ)కు ఈ ఏడాది జూలై 21వ తేదీన ఫిర్యాదు చేశారు. దీంతో జనావాసాలకు సమీపంలో మునిసిపాలిటీ చెత్త డంపింగ్‌ నిలిపి వేస్తూ మరో చోట స్థలం ఎంపిక చేయాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసిం ది. మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కొత్త స్థ లం ఎంపిక చేయకపోగా, చెత్త డంప్‌ను సైతం నిలిపి వేయలేదు. ఎన్జీటీ ఆదేశాలను సైతం అధికారులు ఖాత రు చేయకపోవడంతో ఆందోళనకు గురైన ఆయా కాల నీల వాసులు విధిలేని పరిస్థితుల్లో తమ సమస్యను ప రిష్కరించాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో కలె క్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆండాళమ్మ కాలనీలో ఉన్న మునిసిపాలిటీ చెత్త డంప్‌ కారణంగా ఆరోగ్య సమస్య లు తలెత్తుతున్నాయని, వెంటనే డంప్‌యార్డును మరో చోటికి తరలించాలని విన్నవించారు. ఇప్పటికైనా అధి కారులు స్పందించాలని, లేనిపక్షంలో మూకుమ్మడిగా కా లనీలను వదిలి వెళ్లిపోవడమే శరణ్యమని ప్రజలు తెలిపారు.

Updated Date - Oct 12 , 2026 | 11:28 PM