చాలని వేతనం.. కుటుంబ పోషణ భారం
ABN , Publish Date - Mar 06 , 2026 | 12:25 AM
ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు కళాత్మక విద్య కోసం పార్ట్ టైం ఇన్‌స్ట్రక్టర్ పేరుతో 2012 సంవత్సరంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్లను రూ.4వేలతో నియమించింది.
ఆర్ట్ ఎడ్యుకేషన్ పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ల వేదన
కుట్లు, అల్లికలు, బొమ్మలు వేయడం, క్రీడల్లో నైపుణ్యంపై విద్యార్థులకు శిక్షణ
ప్రభుత్వ ఉపాధ్యాయుల మాదిరిగా విధులు
ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు కళాత్మక విద్య కోసం పార్ట్ టైం ఇన్‌స్ట్రక్టర్ పేరుతో 2012 సంవత్సరంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్లను రూ.4వేలతో నియమించింది. 14 సంవత్సరాలుగా పనిచేస్తున్నా ప్రభుత్వం నేటికీ కనీసం వేతనం చెల్లించడం లేదు. ఇన్ని సంవత్సరాలుగా పని చేస్తున్నా వారికి ప్రస్తుతం ప్రభుత్వం చెల్లించే రూ.11700లతో కుటుంబ పోషణ కష్టంగా మారింది.
ఆంధ్రజ్యోతి, తిరుమలగిరి రూరల్
కళాత్మక విద్య(కుట్లు, అల్లికలు), ఆర్ట్ ఎడ్యుకేషన్(బొమ్మలు వేయడం), పీటీటీలు లేని చోట పీఈటీలను కూడా సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో వీరిని పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లను నియమించారు. పేరుకే వారు పార్ట్‌టైం అయినా పూర్తికాలం పాఠశాలలో ఉండి విద్యార్థులకు విద్య బోధిస్తున్నారు. ఎప్పటికైనా వేతనం పెరుగుతుందేమోననే ఆశతో ఇన్ని సంవత్సరాలుగా చాలీచాలనీ వేతనంతోనే పనిచేస్తున్నారు. వీరికి కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులలాగే ఎఫ్‌ఆర్‌ఎస్ ఉండడం ఉదయం 9గంటలకే పాఠశాలకు వెళ్లడం, సాయంత్రం 4:15 గంటల వరకు పాఠశాలలోనే ఉండి విద్యార్థులకు నిరంతరం అందుబాటులో ఉంటూ కళాత్మక విద్య నేర్పిస్తున్నారు. ప్రభుత్వాలు మారినా వీరి వేతన వెతనలను ఎవరూ పట్టించుకోవడం లేదు. తమ సమస్యలు పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
సృనాత్మకతను వెలికితీస్తూ..
ఉపాధ్యాయులు పాఠశాల ల్లో విద్యార్థులకు కుట్లు, అల్లికలు, బొమ్మలు వేయడం, క్రీడల్లో నైపుణ్యం కలిగేలా తీర్చిదిద్దుతున్నారు. వ్యర్థ పద ర్థాలతో అందమైన రూపాలు, బొమ్మలు తయారు చేయిస్తూ విద్యార్థుల్లో సృనాత్మకతను వెలికితీ స్తున్నారు. సంవత్సరం క్రితం సర్వ శిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న కేజీబీవీ టీచర్లు, వర్కర్లు, ఎంఐఎస్ కో- ఆర్గినేటర్లు, పీటీఐలు అంతా కలిసి 45రోజులు సమ్మె చేసినా ఆర్థిక లోటులో ఉన్నందున కమిటీ వేసి వేతనాలు పరిశీలించి పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం మాట ఇచ్చి సంవత్సరం దాటినా ఆ విషయం పట్టించు కునే వారే కరువయ్యారు. కేవలం రూ.11700 వేతనం ఇచ్చి అది కూడా 12 నెలలు ఇవ్వకుండా వేస విలో వేతనం చెల్లించకుండా, మళ్లీ తిరిగి జూన్, జూలై నెలల్లో నియా మక ప్రక్రియ చేసి నియమిస్తున్నారు. సంవ త్సరమంతా పని చేసినా పనికి గ్యారెంటీ లేకుండా మళ్లీఎప్పుడు నియ మిస్తారో లేదోనని ఆమో మయంలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. సూర్యాపేట జిలా వ్యాప్తంగా 150మంది ఆర్ట్ ఎడ్యుకేషన్ పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లు ఉన్నారు. మండలంలో ఆరుగురు ఆర్ట్ ఎడ్యుకేషన్ పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లు ఉన్నారు.
కనీస వేతనం చెల్లించాలి
నేను 14 సంవత్సరాలుగా పనిచేస్తున్న. ఇప్పటికైనా ప్రభుత్వం మాకు కనీస వేతనం చెల్లించాలి. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వం మా కుటుంబాలకు అండగా ఉండాలి.
బాసాని పార్వతమ్మ, జలాల్‌పురం ఉన్నత పాఠశాలలో పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్.
మాకు అనేక రకాలుగా ఉపయోగం
కళాత్మక విద్య మాకు ఉపయోగపడుతుంది. కు ట్లు, అల్లికలు నిజ జీవితంలో భవిషత్తులో జీవనో పా ఽధికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కళా విద్య ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యన భ్యపి ంచే పేద విద్యార్ధినిలకు ప్రయోజనం చేకూరుతుంది.
సునీత, 8వ తరగతి, జలాల్‌పురం ఉన్నత పాఠశాల