Share News

సూదిని పద్మారెడ్డికి గౌరవ డాక్టరేట్‌

ABN , Publish Date - Jul 07 , 2026 | 04:41 AM

అభ్యుదయ భారత్‌ చారిటబుల్‌ ట్రస్టు వ్యవస్థాపకుడు సూదిని పద్మారెడ్డికి యునైటెడ్‌ అమెరికా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ లభించింది.

సూదిని పద్మారెడ్డికి గౌరవ డాక్టరేట్‌

  • యునైటెడ్‌ అమెరికా వర్సిటీ నుంచి ప్రదానం

  • రాష్ట్రం నుంచి మరో నలుగురికి కూడా

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): అభ్యుదయ భారత్‌ చారిటబుల్‌ ట్రస్టు వ్యవస్థాపకుడు సూదిని పద్మారెడ్డికి యునైటెడ్‌ అమెరికా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ లభించింది. పద్మారెడ్డి సహా తెలంగాణ నుంచి ఐదుగురు ఈ గౌరవాన్ని అందుకున్నారు. పుదుచ్చేరిలోని కంబన్‌ కలైరంగమ్‌ ఆడిటోరియంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్నవారికి గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేశారు. వీరిలో తెలంగాణ రాష్ట్రం నుంచి పద్మారెడ్డి, షాలోమ్‌ ఆఫ్‌ హోప్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సీహెచ్‌ అశోక్‌, జెరుసలేం చారిత్రక ఆధారాలపై పుస్తకం రాసిన లూర్ధుమర్రెడ్డి సింగారెడ్డి, రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్‌ తౌటమ్‌ నైనా దేవి, ఆనంద్‌ ఆశ్రమం సేవా సమితి వ్యవస్థాపకుడు ప్రేమా విశ్వనాథన్‌ ఉన్నారు. కాగా, పద్మారెడ్డి.. సీఎం రేవంత్‌రెడ్డికి మామ కావడం గమనార్హం.

Updated Date - Jul 07 , 2026 | 04:41 AM