ప్యారిస్ ఫ్యాషన్‌వీక్‌లో మెరిసిన సుధారెడ్డి
ABN , Publish Date - Jul 10 , 2026 | 05:51 AM
నిర్వహించిన ఫ్యాషన్ వీక్‌లో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ బిలియనీర్, వితరణశీలి సుధారెడ్డి తళుక్కుమన్నారు.
30 మిలియన్ డాలర్ల ఆభరణాలతో ప్రత్యేక ఆకర్షణ
హైదరాబాద్ సిటీ, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ప్యారిస్ నిర్వహించిన ఫ్యాషన్ వీక్‌లో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ బిలియనీర్, వితరణశీలి సుధారెడ్డి తళుక్కుమన్నారు. ప్రత్యేకమైన వస్త్రధారణ, ఖరీదైన ఆభరణాలతో అతిథులను ఆకట్టుకున్నారు. మూడు రోజుల పాటు ప్యారిస్ లో నిర్వహించిన హౌట్ కొట్యూర్ ఫ్యాషన్ వీక్‌కు అతిథిగానే కాకుండా, ఫ్యాషన్ ఆర్కిటెక్ట్‌గానూ వ్యవహరించారు. ఈ ఫ్యాషన్ వీక్‌లో ఆమె ఽ30 మిలియన్ డాలర్ల విలువైన బంగారు ఆభరణాలు, ప్రత్యేక డిజైనర్ వేర్ ధుస్తులు ధరించి ఆకర్షణగా నిలిచారు.