kumaram bheem asifabad- నీట మునిగిన పంటలు
ABN , Publish Date - Jul 31 , 2026 | 10:38 PM
మండల పరిధిలో ప్రాణహిత బ్యాక్ వాటర్ పంటలను ముంచెత్తింది. రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మండల సరిహద్దుల్లో ప్రవహిస్తున్న ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహి స్తోంది. ఈ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తోడు మహారాష్ట్రలో ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు తోడవడమే కాకుండా ఎగువన ప్రాజెక్టుల్లో గేట్లు వదలడంతో ప్రాణహితకు బ్యాక్‌వాటర్ భారీగా పోటెత్తింది. దీంతో వరద నీరంతా పంట చేలల్లోకి చేరడంతో రైతులు సాగు చేసిన పత్తి పంట పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
బెజ్జూరు, జూలై 31 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలో ప్రాణహిత బ్యాక్ వాటర్ పంటలను ముంచెత్తింది. రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మండల సరిహద్దుల్లో ప్రవహిస్తున్న ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహి స్తోంది. ఈ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తోడు మహారాష్ట్రలో ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు తోడవడమే కాకుండా ఎగువన ప్రాజెక్టుల్లో గేట్లు వదలడంతో ప్రాణహితకు బ్యాక్‌వాటర్ భారీగా పోటెత్తింది. దీంతో వరద నీరంతా పంట చేలల్లోకి చేరడంతో రైతులు సాగు చేసిన పత్తి పంట పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో ప్రాణహి త, పెన్‌గంగ నదులు ప్రవహిస్తున్నాయి. నియోజ కవర్గంలోని బెజ్జూరు, కౌటాల, చింతలమానేపల్లి, సిర్పూర్(టి), దహెగాం మండలాలు నదుల సరిహద్దుల్లో ఉండ డంతో రెండు రోజులుగా కురిసిన వర్షాలకు ప్రాణహి త, పెన్‌గంగ నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రాణహిత తీర ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తున్న పత్తికి తీరని నష్టాన్ని మిగిల్చుతోంది. ప్రతి ఏటా భారీ వర్షాల కారణంగా నదులకు వరదలు రావడం, పంటలు నీట మునిగి నష్టపోవడం షరా మామూలుగా మారింది. ప్రతీసారి నీటమునిగిన పంటలకు వ్యవసాయ శాఖ సర్వేలు చేయడమే కానీ పరిహారం మాత్రం రావడం లేదని తీర ప్రాంతాల రైతులు వాపోతున్నారు. పంటలను వరద ముంచెత్తుతున్న ప్రభుత్వం మాత్రం తగిన చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.
- ఆదిలోనే హంసపాదు..
ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది సరైన వర్షాలు కురవని అటు ప్రభుత్వం, ఇటు అధికార యంత్రాం గం రైతులకు పలు సూచనలు అందజేసింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా సరైన వర్షాలు లేక సాగుపై రైతులు ఆందోళన చెందుతున్న వేళ అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో సాగు చేసిన పంటకు ఆదిలోనే హంసపాదుగా మారింది. నియోజకవర్గంలోని సరిహద్దు ప్రాంతాల్లో ప్రాణహిత నదికి భారీగా వరద పోటెత్తిన కారణంగా పంటలన్నీ నీటిపాలు కావడంతో రైతులు ఆందోళన గురవుతున్నారు.
వరదలతో ఏటా నష్టమే..
- లంగారి శ్రీనివాస్, రైతు తలాయి
భారీ వర్షాలు కురిసినప్పుడల్లా తీర ప్రాంతాల్లో సాగు చేసిన పంటలకు ఏటా తీరని నష్టం జరుగు తోంది. అయినా నష్టపోయిన పంటలకు ప్రభుత్వం మాత్రం పరిహారం ఇవ్వడం లేదు. మొలకదశలో ఉన్న పత్తి పంట నీటిలో మునిగిపోయింది.
ప్రభుత్వం ఆదుకోవాలి..
- ఆత్రం సాయి, రైతు సోమిని
ప్రాణహిత వరదలతో తీవ్రంగా నష్టపోతున్న పంటలకు ప్రభుత్వం ఆదుకొని సాయం అందించాలి. ఇప్పటికే పంటల సాగుకు వేల రూపాయలు అప్పుతె చ్చాం. వేసిన పంటలు వరదలతో మునగడంతో ఏం చేయాలో తోచడం లేదు. అధికారులు కనికరించాలి.
ఖర్జి గ్రామంలో నీటమునిగిన పంటలు
దహెగాం, (ఆంధ్రజ్యోతి): మండలంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురువడంతో ఎర్రవాగు, పెద్దవాగుతో పాటు ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహించడంతో దహెగాం మండలంలోని పలు గ్రామాల్లోని పంటు నీటమునిగాయి. మండ లంలోని ఒడ్డు గూడ, అమరగోండ, దిగిడ, రావులపల్లి, గిరవెల్లి, ఖర్జి, రాంపూర్, మొట్లగూడ, రావులపల్లి ్లగ్రామాల్లో పత్తి, కంది, వరినారుమళ్లు, ప్రాణహిత బ్యాక్ వాటర్‌తో నీటమునిగి పోయాయి. ఏపుగా పెరి గిన పత్తి పంటతో పాటు కంది పంట నీటమునిగి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయా గ్రా మాల రైతులు చెబుతున్నారు. అధికారులు స్పందించి పంటల నష్టం చేపట్టి పరిహారం అందించి ఆదుకోవా లని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. కాగా జిల్లా వ్యవసాయా శాఖ అధికారి వెంకట్‌ను వివరణ కోరగా దహెగాం మండలంలో మూడు వేల ఎకరాల్లో పంట నష్టపోయినట్లు తెలిపారు.