Chief Minister Revanth Reddy: సబ్‌రిజిస్ట్రార్ల పోడియంల తొలగింపు
ABN , Publish Date - Jan 02 , 2026 | 04:50 AM
ఇటీవల కార్యదర్శులతో జరిగిన సమావేశంలో శాఖలవారీగా జరిగిన చర్చల్లో రిజిస్ట్రేషన్ శాఖ గురించి చర్చించే సమయంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పోడియంల గురించి సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు.
వందశాతం తొలగించినట్లు ఫొటోలు పంపిన సబ్‌రిజిస్ట్రార్లు
హైదరాబాద్, జనవరి 1 (ఆంధ్ర జ్యోతి): ఇటీవల కార్యదర్శులతో జరిగిన సమావేశంలో శాఖలవారీగా జరిగిన చర్చల్లో రిజిస్ట్రేషన్ శాఖ గురించి చర్చించే సమయంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పోడియంల గురించి సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. కలెక్టర్లకే లేని ఆర్భాటం సబ్‌రిజిస్ట్రార్‌లకు ఎందుకు? అని ప్రశ్నించారు. వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించారు. దీంతో రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రాష్ట్రంలో ఉన్న 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పోడియంలు తొలగించాలని ఆదేశిస్తూ సర్క్యులర్ పంపారు. ఈ నేపథ్యంలో సబ్ రిజిస్ట్రార్లు వారి పరిధిలో పోడియం ఉన్నప్పటి ఫొటో.. పోడియం తొలగించిన ఫొటోలను జత చేస్తూ స్టాంప్స్‌అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయానికి పంపారు. అన్ని కార్యాలయాల్లో వంద శాతం తొలగించారంటూ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఇదే విషయంపై శుక్రవారం ఐజీ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా అన్ని కార్యాలయాలను పరిశీలించనున్నారు .క్వాషీ జ్యుడీషియల్ అధికారాలు ఉన్న నేపథ్యంలో.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తొలుత పోడియంలు ఏర్పాటు చేశారు.