Share News

విద్యార్థులు ఇష్టపడి చదవాలి

ABN , Publish Date - Sep 24 , 2026 | 11:52 PM

విద్యార్థులు కష్టపడి కాదు ఇష్టపడి చదవాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. గురువారం మం డల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను ఆయన సందర్శించారు.

విద్యార్థులు ఇష్టపడి చదవాలి
కేజీబీవీలో విద్యార్థినీలకు బ్యాగులు అందజేస్తున్న జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

జైపూర్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) :విద్యార్థులు కష్టపడి కాదు ఇష్టపడి చదవాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. గురువారం మం డల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను ఆయన సందర్శించారు. విద్యార్థి నులకు అందిస్తున్న సదుపాయాలు, విద్యాబోధన, పరిసరాలను పరిశీ లించారు. విద్యార్థినీలతో మాట్లాడి వసతుల కల్పన గురించి అడిగి తె లుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలని సూచించారు. అనంతరం తరగతి గదులకు వెళ్లి విద్యార్థినులకు పాఠాలను బోధించారు. ప్రభుత్వం అందజేస్తున్న బ్యాగు లు, షూలు విద్యార్థినులకు తహసీల్దార్‌ వనజారెడ్డితో కలిసి అందించా రు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ఎస్‌వో ఫణిబాల, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2026 | 11:52 PM