విద్యార్థులు కష్టపడి చదవాలి
ABN , Publish Date - Feb 07 , 2026 | 11:58 PM
జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకుని బాగా కష్టపడి చదవాలని జిల్లా విద్యాధికారి యాదయ్య అన్నారు. శనివారం బెస్ట్ రన్నర్స్ సంస్థ ఆధ్వర్యంలో వీగాం ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
డీఈవో యాదయ్య
భీమిని, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకుని బాగా కష్టపడి చదవాలని జిల్లా విద్యాధికారి యాదయ్య అన్నారు. శనివారం బెస్ట్ రన్నర్స్ సంస్థ ఆధ్వర్యంలో వీగాం ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ లక్ష్యం నిర్దేశించుకుని బాగా కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చన్నారు. పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించి తల్లి దండ్రులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలకు మంచి పేరు తేవాలన్నారు. బెస్ట్ రన్నర్స్ సంస్థ యూఎస్‌లో నివసిస్తున్న శ్రీనివా సులు విద్యార్థులకు సైకిళ్లను అందించడం అభినందనీయమ న్నారు. ఈ సందర్భంగా పాఠశాల్లో చదువుతున్న సుదూర ప్రాంతాల విద్యార్థులు పోలంపల్లి, శిఖినం పరిసర ప్రాంతాల 20 మంది విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గంగమోహన్, డీసీఇబీ కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు కుమారస్వామి, ఎంపీఓ మహేష్, కార్యదర్శి బాలమల్లు, సంస్థ ప్రతినిధులు సతీష్ కోలేటి, రంజిత్ అల్లంపల్లి, విద్యార్థులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.