విద్యార్థులు పట్టుదలతో చదవాలి..
ABN , Publish Date - Apr 09 , 2026 | 11:32 PM
ప్రతీ విద్యార్థి చిన్నతనం నుంచే ఒక లక్ష్యం ఎంచుకుని ఆలక్ష్యం సాధించేందుకు పట్టుదల క్రమశిక్షణతో చద వా లని లక్షెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జి కాసమల సాయికిరణ్ అన్నారు.
లక్షెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జి సాయికిరణ్ కాసమల
లక్షెట్టిపేట, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ప్రతీ విద్యార్థి చిన్నతనం నుంచే ఒక లక్ష్యం ఎంచుకుని ఆలక్ష్యం సాధించేందుకు పట్టుదల క్రమశిక్షణతో చద వా లని లక్షెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జి కాసమల సాయికిరణ్ అన్నారు. గు రువారం లక్షెట్టిపేట పట్టణంలోని మహాత్మ జ్యోతిభా పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలుగుతామన్నారు. కేవలం ర్యాంకుల కో సం మాత్రమే చదవడం కాదని మనం చదివే చదువు జీవితంలో స్థిరపడేం దుకు ఉపయోగపడాలన్నారు. చదువులో ప్రతీ ఒక్కరూ పోటీతత్వం పె ట్టుకోవాలని మనకంటే ఎక్కువ మార్కులు సాధించిన వాళ్లను దృష్టిలో పె ట్టుకుని అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాలన్న పట్టుదల ఉండాలని అప్పుడే మనం ముందుకు సాగుతామన్నారు. ముఖ్యంగా మొబైల్స్ వాడకం తగ్గించుకోవాలని మన దృష్టి మొత్తం చదువుపైనే ఉండేలా చూసుకోవాల న్నారు. ఈకార్యక్రమంలో ఎంజేపి ప్రిన్సిపల్ మంగ, బార్ అసోసియేషన్ ఉ పాధ్యక్షురాలు పద్మ, ప్రధానకార్యదర్శి వెల్పుల సత్యం, సీనియర్ న్యాయవా దులు కారుకూరి సురేందర్, రాజేశ్వర్‌రావు, గాండ్ల సత్యనారాయణ, అక్కల శ్రీధర్, రాజేశ్వర్, మౌనికతోపాటు న్యాయవాదులు ఉపాద్యాయులు, విధ్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.