Share News

kumaram bheem asifabad-విద్యార్థులు పరీక్షలపై భయం వీడాలి

ABN , Publish Date - Mar 11 , 2026 | 11:13 PM

విద్యార్థులు పరీక్షలపై భయం వీడి, ప్రశాంతంగా రాయాలని ఏఎస్పీ చిత్తరంజన్‌ అన్నారు. ఆసిఫాబాద్‌ పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా బుధవారం పదో తరగతి విద్యార్థులకు పరీక్షల సామాగ్రి పంపిణీ చేశారు.

kumaram bheem asifabad-విద్యార్థులు పరీక్షలపై భయం వీడాలి
పరీక్ష సామగ్రి పంపిణీ చేసిన ఏఎస్పీ చిత్తరంజన్‌

ఆసిఫాబాద్‌రూరల్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు పరీక్షలపై భయం వీడి, ప్రశాంతంగా రాయాలని ఏఎస్పీ చిత్తరంజన్‌ అన్నారు. ఆసిఫాబాద్‌ పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా బుధవారం పదో తరగతి విద్యార్థులకు పరీక్షల సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం సంవత్సరం పొడువునా ఇంత చదివామన్నది కాదు పరీక్షలో ఆ మూడు గంటల్లో మనం ఎంత రాశామన్నది చాలా ముఖ్యమని అన్నారు. పదో తరగతి పరీక్షలకు సన్నద్దమవుతున్న విద్యార్థులకు ఏ విధంగా పరీక్షలకు సిద్దమవ్వాలో దిశా నిర్దేశం చేశారు. పదవ తరగతి పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సీఐ బాలాజీ వరప్రసాద్‌, ఎస్సై కమలాకర్‌ పాల్గొన్నారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): పదో తరగతి విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలకు సిద్దం కావాలని ఏఎస్పీ చిత్తరంజన్‌ అన్నారు. పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని పదో తరగతి విద్యార్థులు పరీక్షా సమాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలు విద్యార్థుల జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయని అన్నారు. ఈ దశలో కష్ట పడి చదివితే భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి ఎదగానికి ఇది బలమైన పునాధి అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ, ఎస్సై మహేందర్‌, శివచరణ్‌కుమార్‌, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): పరీక్షల సమయంలో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకూడదని ఏఎస్పీ చిత్తరంజన్‌ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా పరీక్షా సమాగ్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీఐ సంజయ్‌, ఎస్సై వెంకటకృష్ణ, ప్రధానోపాధ్యాయుడు చైతన్యలతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కెరమెరి, (ఆంధ్రజ్యోతి): పదో తరగతి విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాయాలని ఏఎస్పీ చిత్తరంజన్‌ అన్నారు. మోడి గ్రామంలో ఆశ్రమ, జడ్పీపీఎస్‌, కేజీబీవీ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ, ఎస్సై మధుకర్‌, సర్పంచ్‌ లక్ష్మణ్‌రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

జైనూర్‌, (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఏఎస్పీ చితరంజన్‌ అన్నారు. స్థానిక బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో బుధవారం జైనూర్‌, సిర్పూర్‌(యు), లింగాపూర్‌ విద్యార్థిని,విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్లు, వాటర్‌ బాటీళ్లు పంపీణి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏఎస్పీ మాట్లాడుతు పొలీసుల తరపున పోత్సాహకంగా విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు పది వేల పెన్నులు, 2,,500 వాటర్‌ బాటిళ్లు, పరీక్ష ప్యాడ్లు పంపీణి చేశామన్నారు. కార్యక్రమంలో సీఐ రమేశ్‌, పాఠశాల హెచ్‌ఎంలు పార్వతీబాయి, అశోక్‌, ఉపాధ్యా యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

లింగాపూర్‌, (ఆంధ్రజ్యోతి) పదో తరగతి విద్యార్థులు మనోధైర్యంతో పరీక్షలు రాయాలని ఏఎస్పీ చితరంజన్‌ అన్నారు అన్నారు. మండల కేంద్రంలో మొత్తం 65 మంది విద్యార్థులకు పరీక్ష సామగ్రి అందజేశారు. కార్యక్రమంలో సీఐ రమేశ్‌, ఎస్సై గంగన్న, ఎస్‌వో మీనాకుమారి, హెచ్‌ఎం శంక ర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2026 | 11:13 PM