Share News

విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండాలి

ABN , Publish Date - Nov 27 , 2026 | 10:36 PM

విద్యార్థులు వ్యసనాలకు, మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని చెన్నూరు కోర్టు జూనియర్‌ సివి ల్‌ జడ్జి పి. రవి అన్నారు.

విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండాలి

కోటపల్లిలో అవగాహన కల్పిస్తున్న జడ్జి రవి

కోటపల్లి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు వ్యసనాలకు, మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని చెన్నూరు కోర్టు జూనియర్‌ సివి ల్‌ జడ్జి పి. రవి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి విద్యార్థులకు చట్టా లపై అవగాహన కల్పించారు. మత్తు పదార్ధాల వినియోగం వల్ల కలిగే దు ష్పరిణామాలు, వాటి వల్ల వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబం, సమా జంపై పడే ప్రభావం గురించి వివరించారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగానికి సంబంధించి ఎన్‌డీపీఎస్‌ చట్టంలోని నిబంధనలు, వాటి ఉల్లంఘనకు విధించే శిక్షల గురించి అవగాహన క ల్పించారు. అలాగే చిన్నారులు, బాల బాలికల రక్షణ కోసం రూపొందిం చిన పోక్సో చట్టం గురించి వివరించి బాలలపై జరిగే లైంగిక వేధింపులు, దాడుల నుంచి రక్షణ పొందే హక్కులు, అలాంటి ఘటనలు ఎదురైన ప్పు డు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అధికారులకు సమాచారం అందించా ల్సిన విధానం గురించి తెలిపారు. విద్యార్థులు మంచి అలవాట్లను అలవ ర్చుకో వాలని, చట్టాలపై అవగాహణ పెంచుకోవాలని సూచించారు. మత్తు పదా ర్థాల వినియోగం, విక్రయాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ రాజశేఖర్‌, న్యా యవాదులు మహేష్‌, పున్నం, సంజీవ్‌, నరేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2026 | 10:36 PM