Share News

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

ABN , Publish Date - Jul 25 , 2026 | 10:36 PM

విద్యార్థులు క్రమ శిక్షణతో, ఆత్మవి శ్వాసంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు అన్నారు.

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు

బెల్లంపల్లి, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు క్రమ శిక్షణతో, ఆత్మవి శ్వాసంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు అన్నారు. శనివారం పట్టణంలోని గిరిజ న ఆశ్రమ పాఠశాలను బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌తో కలిసి ఆకస్మికం గా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడా రు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోటీ పరీక్షలకు మెరుగైన శిక్షణ అందించడమే లక్ష్యంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. విద్యార్థులకు గణిత శాస్త్రంలోని మెళకువలను నేర్పించారు. గణితంలో విద్యార్థులు మెళకువలు నేర్చుకుంటే అత్యుత్తమ మార్కులు సా ధించవచ్చని సూచించారు. అనంతరం పాఠశాల తరగతులను, హాస్టల్‌ భవ నాన్ని పరీశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏటీడీవో సు రేష్‌, తహసీల్దార్‌ కృష్ణ, ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం అజ్మీర నరసింహా, ఉ పాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2026 | 10:36 PM