Share News

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి

ABN , Publish Date - Sep 08 , 2026 | 12:38 AM

విద్యార్థులు చదువుపై మక్కువ పెంచుకుని ఉత్తమ పౌరులుగా ఎదిగి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ కోరారు. యూనియన్‌ బ్యాంక్‌ అఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌ కింద జిల్లాలోని కస్తూర్భాగాంధీ విద్యాలయాలకు 150 మంచాలు, బెడ్స్‌లను అందించారు. దీనిలో భాగంగా

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి
సిరిసిల్ల పెద్దూర్‌లో కస్తూర్భిగాంధీ విద్యాలయంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

సిరిసిల్ల అర్బన్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చదువుపై మక్కువ పెంచుకుని ఉత్తమ పౌరులుగా ఎదిగి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ కోరారు. యూనియన్‌ బ్యాంక్‌ అఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌ కింద జిల్లాలోని కస్తూర్భాగాంధీ విద్యాలయాలకు 150 మంచాలు, బెడ్స్‌లను అందించారు. దీనిలో భాగంగా సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని పెద్దూర్‌ శివారులోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాల యంలో ఏర్పాటు చేసిన మంచాలు, బెడ్స్‌లను సోమవారం జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి యోగక్షేమాలతో పాటు విద్యాలయంలో వసుతుల, మెనూ ప్రకారం భోజనం విద్యాభోధనలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు, వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, బాగా చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. అన్ని విద్యాలయాల్లో వసతులు, భోజనం పరిశీలించేందుకు టాస్క్‌ఫోర్స్‌ టీంలను ఏర్పాటు చేశామని తెలిపారు. కస్తూర్బాగాంధీ విద్యాభివృద్ధికి ఎన్ని సేవలు అందించారని కొనియా డారు. ప్రతి విద్యార్థి నేపథ్యం ఏదైనా పుట్టిన ప్రాంతం, ఆర్థిక పరిస్థితి విద్యలో ప్రతిభ చూపేందుకు అడ్డు చూపవని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి సామాజిక బాధ్యతగా ప్లాస్టిక్‌ కవర్లు, బాటిల్స్‌లను వినియోగించవద్దన్నారు. పెద్దలను గౌరవించాలని సూచించారు. విలు వలు ఉన్న విద్యార్థిగా ఎదగాలని కోరారు. ప్రతి విద్యార్థి ఒక ప్రణాళిక ప్రకారం చదవాలని, తాము అనుకున్న లక్ష్యం చేరుకోవాలని ఆకాం క్షించారు. ఏదైనా ఉద్యోగం, స్వయం ఉపాధిలో స్థిరపడాలని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి మొండయ్య, జీ సీడీఓ పద్మజ, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ కే రాజీవ్‌ కుమార్‌, బ్యాంక్‌ చీఫ్‌ మేనేజర్‌ వినోద్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 08 , 2026 | 12:38 AM