విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
ABN , Publish Date - Oct 04 , 2026 | 12:23 AM
ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని లక్ష్యం చేరుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అకాంక్షించారు. సిరిసిల్ల అర్బన్ పరిధిలోని పెద్దూర్ శివారులోని మహాత్మాజ్యోతి బాపూలే విద్యాలయాన్ని శనివారం రాత్రి జిల్లా కలెక్టర్
సిరిసిల్ల అర్బన్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని లక్ష్యం చేరుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అకాంక్షించారు. సిరిసిల్ల అర్బన్ పరిధిలోని పెద్దూర్ శివారులోని మహాత్మాజ్యోతి బాపూలే విద్యాలయాన్ని శనివారం రాత్రి జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బియ్యం, కూరగాయలు, పండ్లు, నెయ్యి నాణ్యత, గడువు తేదీని తనిఖీ చేశారు. మెనూ చార్ట్ పరిశీలించి. ఏ ఏ ఆహార పదార్థాలు సిద్ధం చేస్తున్నారో పరిశీ లించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించారా అని ఆరా తీశారు. నెలలో నాలుగు సార్లు చికెన్, రెండు సార్లు మటన్, ప్రతి రోజూ గుడ్డు ఇస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆర్‌ఓ ప్లాంట్ ను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుని దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని పిలుపు నిచ్చారు. రెసిడెన్షియల్ విద్యాలయాల్లో ప్రవేశానికి చాలా మంది పోటీ పడతారని, మంచి అవకాశం వచ్చిందని, వినియోగించు కోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మెనూ ప్రకారం నాణ్య మైన భోజనం అందిస్తున్నామని, దీనిని పరిశీలించేందుకు ప్రతి రెసిడె న్షియల్ విద్యాలయాల్లో తనిఖీ కోసం ఒక మండల స్థాయి అధికారులను కేటాయించామని వివరించారు. వారు విద్యాలయం తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారని పేర్కొన్నారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, దీంతో ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.తరగతి గదులు, వసతి గదులు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, విలువైన సమయాన్ని వృథా చేయవద్దని సూచించారు. విద్యార్థులు రోజూ ఆటలు ఆడాలని, సంగీతం, డ్యాన్స్ నచ్చిన విభాగంలో ఉండాలని సూచించారు. మంచిగా చదివి తమ ప్రాంత విద్యార్థులకు ఆదర్శప్రాయంగా నిలవాలని ఆకాక్షాంచారు. విద్యార్థులు వివిధ వృత్తులు, ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు.