kumaram bheem asifabad- విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
ABN , Publish Date - Oct 30 , 2026 | 10:40 PM
గిరిజన క్రీడా పాఠశాల విద్యార్థులు క్రీడల్లో రాణించి జిల్లాకు, రాష్ట్రనికి మంచిపేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన క్రీడా పాఠశాలలోని విద్యార్థులకు శుక్రవారం క్రీడా కిట్లను కలెక్టర్ పంపిణీ చేశారు. విద్యార్థులకు అవసరమైన ట్రాక్‌షూట్, షూస్, టీ షర్ట్‌లు, షార్ట్స్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా రవిఫుడ్స్, చీఫ్ టు గ్రీడ్, త్రీఎఫ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సహకారంతో ఉచితంగా క్రీడా కిట్లను పంపిణీ చేయడం అబినందనీయమన్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): గిరిజన క్రీడా పాఠశాల విద్యార్థులు క్రీడల్లో రాణించి జిల్లాకు, రాష్ట్రనికి మంచిపేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన క్రీడా పాఠశాలలోని విద్యార్థులకు శుక్రవారం క్రీడా కిట్లను కలెక్టర్ పంపిణీ చేశారు. విద్యార్థులకు అవసరమైన ట్రాక్‌షూట్, షూస్, టీ షర్ట్‌లు, షార్ట్స్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా రవిఫుడ్స్, చీఫ్ టు గ్రీడ్, త్రీఎఫ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సహకారంతో ఉచితంగా క్రీడా కిట్లను పంపిణీ చేయడం అబినందనీయమన్నారు. క్రీడా పాఠశాల విద్యార్థుల ప్రగతికి జిల్లా యంత్రాంగాం వివిధ సంస్థల సహకారం ఎల్లప్పుడు ఉంటుందని చెప్పారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకొవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ డీడీ జాదవ్ అంబాజీ, డీఎస్‌వో శేకు, యంగ్ ఇండియా నోడల్ అధికారి మీనారెడ్డి, జిల్లా అథ్లెటిక్ అసోసియోషన్ అధ్యక్షుడు కొట్నాక విజయ్, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ రాంమోహన్, హెచ్‌ఎం లింబరావు, కోచ్‌లు విద్యాసాగర్, అరవింద్, తిరుమల్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ కె హరిత అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మహిళాభివృద్ది శిశు సంక్షేమశాఖ, జిల్లా మహిళా సాదికారత కేంద్రం ఆధ్వర్యంలో స్వచ్ఛత దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని చెప్పారు. వ్యర్థాల ఉత్పత్తి తగ్గించడం, పర్యావరణ పరిరక్షణతో పాటు తడిచెత్త, పొడిచెత్తను విడివిడిగా సేకరించాలని సూచించారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యువో స్వరూపరాణి, కోఆర్డినేటర్ శారద, వైద్యాధికారులు వెంకటేష్, సోహెల్, సూపర్‌వైజర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో విద్య ను అభ్యసించే విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమశాఖ పోస్టు మెట్రిక్ వసతిగృహన్ని శుక్రవారం కలెక్టర్ తనిఖీ చేశారు. వంటగది, వంట సామగ్రి, సరుకుల నిల్వ గదిని పరిశీలించారు. వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థినులు, పనిచేస్తున్న వంట సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. వంటగది, మూత్రశాలలు, స్నానపు గదులు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీడీ జాదవ్ అంబాజీ తదితరులు పాల్గొన్నారు.