విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలి
ABN , Publish Date - Oct 11 , 2026 | 11:38 PM
విద్యార్థులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని అన్ని రంగాలలో రాణించాలని నాగర్‌కర్నూల్ జిల్లా బాలిక వి ద్యా సమన్వయ అధికారి (జీఈసీవో) శోభారాణి అన్నారు.
సాంస్కృతిక శిబిరంలో మాట్లాడుతున్న శోభారాణి
- జిల్లా జీఈసీవో శోభారాణి
వెల్దండ, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని అన్ని రంగాలలో రాణించాలని నాగర్‌కర్నూల్ జిల్లా బాలిక వి ద్యా సమన్వయ అధికారి (జీఈసీవో) శోభారాణి అన్నారు. మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఆదివారం ఐక్యత ఫౌండేషన్, వందేమాతరం ఫౌండేషన్, మైవిలేజ్ మోడల్‌విలేజ్, శృతిలయ కల్చరల్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థినులకు నిర్వహించిన దసరా సాంస్కృతిక శిక్షణ శిబిరం ప్రారంభమైంది. శిబిరాన్ని శోభారాణి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో ఎంతో ప్రతిభ దాగుందని, ఇటువంటి శిక్షణ శిబిరాలలో తమ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చున్నారు. ప్రతీ ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగుందని, వాటికి సానపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శిభిరంలో లాంగ్వేజ్, లాజిక్, లైఫ్‌స్కిల్స్, నైతిక విలువలు, యోగ, బతుకమ్మ కోలాటం, శాస్త్రీయ నృత్యం తదితర అంశాలపై ఇచ్చే శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని శోభారాణి పేర్కొన్నారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో శృతిలయ కల్చర్ అకాడమీ వ్యవస్థాపకులు దార్ల చిత్తరంజన్‌దాస్, ఎస్‌ఐ శ్రీనివాసులు, ఐక్యత ఫౌండేషన్ ప్రతినిధి సుంకిరెడ్డి వరప్రసాద్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్, శ్రీరాం, రవికాంత్, సంద్యారెడ్డి, రవళి, మల్లేష్, వసంత, పల్లవి, జ్యోతి ఉన్నారు.