Share News

kumaram bheem asifabad- విద్యార్థులకు సులభ రీతిలో బోధించాలి

ABN , Publish Date - Jan 27 , 2026 | 10:51 PM

విద్యార్థులకు సులభ రీతిలో పాఠాలు బోధించాలని కలెక్టర్‌ హరిత అన్నారు. ఆసిఫాబాద్‌ మండలం పారిబండ గ్రామంలోని గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమిక పాఠశాలను మంగళవారం కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులు, బోధన విధానం, విద్యార్థుల అభ్యాసన స్థాయి సామర్థ్యాలను పరిశీలించారు.

kumaram bheem asifabad- విద్యార్థులకు సులభ రీతిలో బోధించాలి
వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ హరిత

ఆసిఫాబాద్‌రూరల్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు సులభ రీతిలో పాఠాలు బోధించాలని కలెక్టర్‌ హరిత అన్నారు. ఆసిఫాబాద్‌ మండలం పారిబండ గ్రామంలోని గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమిక పాఠశాలను మంగళవారం కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులు, బోధన విధానం, విద్యార్థుల అభ్యాసన స్థాయి సామర్థ్యాలను పరిశీలించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులను పాఠ్యాంశాలకు సంబంధించి ప్రశ్నలు అడిగి వారి అవగాహన, సామర్థ్యాలను పరీక్షించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఆసక్తి కలిగించే విధంగా ఉపాధ్యాయులు బోధన అందించాలని సూచించారు. ప్రతి విద్యార్థి అభ్యాసంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. వెనకబడిన విద్యార్థులను గుర్తించి అదనపు శిక్షణ అందించాలని ఆదేశించారు. పాఠశాలలో విద్యార్థుల కు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వంటశాల, ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. ఆమె వెంట ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు.

నీతి ఆయోగ్‌ లక్ష్యాలను చేరుకోవాలి

తిర్యాణి, (ఆంధ్రజ్యోతి): నీతి ఆయోగ్‌ కార్యక్రమంలో పేర్కొన్న ఆరు క్లస్టర్లలోని లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్‌ హరిత అన్నారు. నీతి ఆయోగ్‌ కార్యక్రమంపై మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసి కలెక్టర్‌ పాల్గొన్నారు. ఆరు అంశాలకు సంబందించి అధికారులతో ఆమె మాట్లాడారు. త్వరిగతిన లక్ష్యాలను చేరుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం మాట్లాడుతూ నీతి ఆయోగ్‌ కార్యక్రమం తిర్యాణి మండలంలో గొప్పగా సాగుతుందని తెలిపారు. సంపూర్ణత అభి యాన్‌ 2.0 లక్ష్యాలను చేరుకునే విధంగా ఎప్పుటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నామని చెప్పారు. అధి కారులు కూడా లక్ష్యాలు చేసుకునేందుకు చర్యలు తీసుకు టున్నారని వివరించారు. రానున్న రెండు నెలల కాలంలో లక్ష్యాలను చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. మండలంలోని టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డీడీ రమాదేవి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గుండెల్లో నిలుపుకుంటే గిరిజనులు మరిచి పోరు

తిర్యాణి, (ఆంఽధ్రజ్యోతి): గిరిజనులు గుండెల్లో నిలుపుకుంటే ఎవరిని అంత తేలిగ్గా మరిచి పోరన్న విషయం అర్థమైందని కలెక్టర్‌ హరిత అన్నారు. గిరిజనుల ఆరాధ్య దైవం మైకల్‌ యార్క్‌ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించచారరు. ఈ సందర్భంగా ఆయన స్పూర్తిదాయకంగా నిర్మించిన స్టడీ సర్కిల్‌ను కలెక్టర్‌ ప్రారంభించారు. గిన్నధరిలో జరిగిన మైక్‌ యార్క్‌ జన్మదిన వేడుకలలో రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌ గోండి భాషలో గిరిజనులను పలుకరించారు. దీంతో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో హర్షధ్వనాలు వెల్లివిరిసాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిన్నెధరి గ్రామాన్ని మరో మార్లవాయిగా అభివృద్ధి చేస్తామని అన్నారు. గిరిజనులకు హైమన్‌ డార్ఫ దంపతులతో పాటు మైకల్‌ యార్క్‌ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డీడీ రమాదేవి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, సర్పంచ్‌ నరేష్‌, గిరిజన సంఘాల నాయకులు అర్జుమాస్టర్‌, మోతిరాం, గుణవంతరావు, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 27 , 2026 | 10:51 PM