Share News

kumaram bheem asifabad- విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలి

ABN , Publish Date - Aug 16 , 2026 | 11:23 PM

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జైనూర్‌ మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని ఆదివారం కలెక్టర్‌ తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందిస్తున్న బోధన, వసతి, పరిసరాల పరిశుభ్రత, మధ్యాహ్న భోజనంలో నాణ్యత తదితర అంశాలను పరిశీలించారు.

kumaram bheem asifabad- విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలి
విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తున్న కలెక్టర్‌ హరిత

లింగాపూర్‌/జైనూర్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జైనూర్‌ మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని ఆదివారం కలెక్టర్‌ తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందిస్తున్న బోధన, వసతి, పరిసరాల పరిశుభ్రత, మధ్యాహ్న భోజనంలో నాణ్యత తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలని అన్నారు. భోజనంలో నాణ్యత పాటించాలని సూచించారు. విద్యార్థినుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని భోజనం తయారీలో నాణ్యమైన సరుకులను వినియోగంచాలన్నారు. వంటశాల, భోజన ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. విద్యార్థినులతో మాట్లాడి వసతి, భోజనం, తాగునీరు, పాఠశాల పరిసరాలు, ఇతర మౌలిక వసతులపై ఆరా తీశారు. ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని చెప్పారు. ప్రస్తుత సమాజనంలో బాలికలు తమ హక్కులు, బాధ్యతలు తెలుసుకుని ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదగాలని ఆకాక్షించారు. విద్యార్థినులు తమకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని లక్ష్యం చేసుకోవాలని సూచించారు. విద్యార్థినులు క్రమశిక్షణతో సాగితే ఉత్తమ ఫలితాలు సాధించి జీవితంలో స్థిర పడే అవకాశం ఉందని చెప్పారు. విద్యార్థినుల భద్రత, ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని తెలిపారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేసి ఆహారం రుచి, నాణ్యత పరిశీలించారు. కార్యక్రమంలో సంబంధితశాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం లింగాపూర్‌ మండలంలోని మిట్టే, సప్తగుండాల జలపాతాన్ని కలెక్టర్‌ సందర్శించారు. జలపాతం వద్ద సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు.

Updated Date - Aug 16 , 2026 | 11:24 PM