Share News

విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి

ABN , Publish Date - Oct 27 , 2026 | 10:34 PM

ప్రభుత్వ, సంక్షేమ వసతి గృ హాల్లో విద్యానభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్య, సకా లంలో మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని కలెక్టర్‌ కుమార్‌ దీ పక్‌ సూచించారు.

 విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి

కస్తూర్భా గాంధీ విద్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్‌

నస్పూర్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ, సంక్షేమ వసతి గృ హాల్లో విద్యానభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్య, సకా లంలో మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని కలెక్టర్‌ కుమార్‌ దీ పక్‌ సూచించారు. నస్పూర్‌ కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అ డిగి తెలుసుకున్నారు. విద్యాలయ పరిసరాలు, రికార్డులు, విద్య బోధన, భోజనం పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు ఆర్థమైయ్యే విధంగా బోధన ఉండాలన్నారు. అభ్యసన సామర్థ్యాన్ని మెరుగు పర్చిందుకు ప్రత్యే క శ్రద్ధ చూపాలన్నారు. నిర్ణీత మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారం సకాలంలో అందించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు అవసరమై న చర్యలను చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాలయం ప్రిన్సిపల్‌ మౌనిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2026 | 10:35 PM