Share News

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి

ABN , Publish Date - Feb 03 , 2026 | 11:53 PM

విద్యా ర్థులకు మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల, రేగులగూడెం ఆశ్రమ పాఠ శాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేజీబీవీలో నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాల న్నారు.

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి

కాసిపేట, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి) : విద్యా ర్థులకు మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల, రేగులగూడెం ఆశ్రమ పాఠ శాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేజీబీవీలో నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాల న్నారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థినీల ఆరో గ్యం పట్ట శ్రద్ద వహించాలన్నారు. పాఠశాలకు మంజూరైన భోజన శాలను త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రేగుల గూడెం గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలకు మంజూరైన అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాల న్నారు. విద్యార్థులతో మాట్లాడుతూ ప్రణాళిక బద్దంగా చదువుకుని మెరుగైన ఫలితాలను సాధించాలన్నారు. పది పరీక్షల్లో మెరుగైన ఫలి తాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయా లన్నారు. సమయపాలన పాటించని ఉపాధ్యా యులపై శాఖపరంగా చర్యలుంటాయన్నారు. కలెక్టర్‌ వెంట ఉపాధ్యాయులు ఉన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 11:53 PM