Share News

kumaram bheem asifabad- విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలి

ABN , Publish Date - Aug 12 , 2026 | 11:37 PM

ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని గిరిజన సంక్షేమశాఖ డీడీ అంబాజీ అన్నారు. మండలంలోని బెజ్జూరు, సోమిని, సలుగుపల్లి, కుంటలమానేపల్లి ఆశ్రమ పాఠశాలలను బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లోని రికార్డులు, వంటగదులు పరిశీలించారు. విద్యార్థులకు ఉత్తమ బోధనతో పాటు మెనూ ప్రకారం బోజనాన్ని అందించాలని సూచించారు.

kumaram bheem asifabad- విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలి
సోమిని పాఠశాలలో వంట సామగ్రి పరిశీలిస్తున్న డీడీ అంబాజీ

బెజ్జూరు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని గిరిజన సంక్షేమశాఖ డీడీ అంబాజీ అన్నారు. మండలంలోని బెజ్జూరు, సోమిని, సలుగుపల్లి, కుంటలమానేపల్లి ఆశ్రమ పాఠశాలలను బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లోని రికార్డులు, వంటగదులు పరిశీలించారు. విద్యార్థులకు ఉత్తమ బోధనతో పాటు మెనూ ప్రకారం బోజనాన్ని అందించాలని సూచించారు. మంగళవారం రాత్రి సోమిని ఆశ్రమ పాఠశాలకు చేరుకొని విద్యార్థులతో రాత్రి బస చేశారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే వారితో కలిసి బోజనం చేసి నిద్రించారు. తెల్లవారు వివిధ పాఠశాలల్లో తనిఖీ చేశారు. విద్యార్థులో మధ్యాహ్న బోజనం చేశారు. పాఠశాలల్లో వర్కర్ల సమస్య ఉందని చెప్పడంతో పీవో దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. వర్షాకాలం కావడంతో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని సూచించారు. ఆయన వెంట హెచ్‌ఎంలు భిక్షమయ్య, రమేశ్‌, పరశురాం, మారుబాయి, వార్డెన్‌ శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

పెంచికల్‌పేట, (ఆంధ్రజ్యోతి): ఎల్లూరు ఆశ్రమ పాఠశాలను గిరిజన సంక్షేమశాఖ డీడీ అంబాజీ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో వివిధ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆహార నాణ్యతను, పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. అలాగే మెనూ ప్రకారం భోజన వసతి కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఆశోక్‌ కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ఒర్రెను దాటి.. పాఠశాలలను తనిఖీ చేసి..

బెజ్జూరు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): పాఠశాలలను తనిఖీ చేసేందుకు వచ్చిన గిరిజన సంక్షేమశాఖ డీడీ బుధవారం ఒర్రెను ఇబ్బందులు పడుతూ దాటాల్సిన పరిస్థితి నెలకొన్నది. మండలంలోని సోమిని గిరిజన ఆశ్రమ పాఠశాలను మంగళవారం రాత్రి తనిఖీ చేసేందుకు వెళ్లిన గిరిజన సంక్షేమశాఖ డీడీ అంబాజీ అక్కడే పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి బస చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బుధవారం ఇతర పాఠశాలలను తనిఖీ చేసేందుకు బయలుదేరగా ఉదయం వర్షం కురిసింది. దీంతో కుశ్నపల్లి-సోమిని గ్రామాల మధ్య ఒర్రెలు ఉప్పొంగి ప్రవహించి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గంటపాటు ఒర్రెల వద్ద నిలిచిపోయారు. ఒర్రె ప్రవాహం తగ్గకపోవడంతో స్వయంగా డీడీ ఉపాధ్యాయుల సహాయంతో ఒర్రెలో నడుచుకుంటూ ప్రవాహాన్ని దాటారు. ఇది చూసిన పలువురు ఎన్నో ఏళ్లుగా ఒర్రెలపై వంతెనలు లేక అవస్థలు పడుతున్నామని, స్వయంగా ఓ జిల్లా అధికారి ఒర్రెను దాటుకుంటూ రావడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పటికైనా ఒర్రెపై కల్వర్టు నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Aug 12 , 2026 | 11:37 PM