kumaram bheem asifabad- విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలి
ABN , Publish Date - Feb 07 , 2026 | 11:54 PM
ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు మెనూ ప్రకారం రుచికరమైన ఆహారాన్ని అందించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. రెబ్బెన మండలం గంగాపూర్‌లో గల కస్తూర్బాగాంధీ బాలకల విద్యాలయాన్ని శనివారం ఆకస్మికంగా సందర్శించారు. వంట శాల, తిరగతి గదులు, హాజరు పట్టికలు, పారిశుధ్య, నిర్వహణ అంశాలను పరిశీలించారు
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు మెనూ ప్రకారం రుచికరమైన ఆహారాన్ని అందించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. రెబ్బెన మండలం గంగాపూర్‌లో గల కస్తూర్బాగాంధీ బాలకల విద్యాలయాన్ని శనివారం ఆకస్మికంగా సందర్శించారు. వంట శాల, తిరగతి గదులు, హాజరు పట్టికలు, పారిశుధ్య, నిర్వహణ అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. మధ్యాహ్న బోజనంలో విద్యార్థులకు మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలన్నారు. భోజనశాల, తరగతి గదులు, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. పదో తరగతి విద్యార్థులను వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలని తెలిపారు. విద్యార్థులకు పౌష్టిక ఆహారంతో పాటు శుద్ధమైన తాగునీటిని అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. ఉపాధి హామీ కార్యాలయాన్ని సందర్శించారు. కూలీలకు నిబంధనల మేరకు పని దినాలు కల్పించాలని తెలిపారు. మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీని సందర్శించి గ్రామంలోని నర్సరీ నిర్వహణను పరిశీలించారు. నర్సరీలో పెంచుతున్న మొక్కల రక్షణకు చర్యలు తీసుకోవాలని, సకాలంలో నీటిని అందించి మొక్కలను సంరక్షించాలని నిర్వహకులకు సూచించారు. మండలంలోని పులికుంట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల హాజరు శాతాన్ని పెంపొందించాలన్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్యుల, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటిస్తూ అందుబాటులో ఉండాలని సూచించారు. గర్భిణులు, బాలింతలకు సమయానుసారంగా పరీక్షలు నిర్వహించి పోషకాహారం, అవసరమైన మందులు అందించాలని తెలిపారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. భూ భారతి రికార్డులు, వివిధ ధ్రువపత్రాలు, కల్యాణలక్ష్మి దరఖా స్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. వివిధ పనుల కోసం కార్యాల యానికి వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం కొండపల్లి గ్రామ పంచాయతీని సందర్శించి గ్రామంలోని నర్సరీ నిర్వ హణను పరిశీలించి నిర్వహకులకు పలు సూచనలు చేశారు. ఆమె వెంట సర్పంచ్ వెంకటేశంచారి, డాక్టర్ సుజిత్, డాక్టర్ రిషికా, సీహెచ్‌వో జగదీష్, ఎస్‌వో పద్మ, ఉపాధ్యాయులు, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల సిబ్బంది ఉన్నారు.