విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలి
ABN , Publish Date - Apr 16 , 2026 | 11:26 PM
పాఠశాలలో విద్యార్థులకు ఇ బ్బందులు కలగకుండా అన్ని మౌ లిక వసతులు సమకూర్చాలని కలె క్టర్ బదావత్ సంతోష్ అన్నారు.
- గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ బదావత్ సంతోష్
కల్వకుర్తి, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యో తి) : పాఠశాలలో విద్యార్థులకు ఇ బ్బందులు కలగకుండా అన్ని మౌ లిక వసతులు సమకూర్చాలని కలె క్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గు రువారం కల్వకుర్తి పట్టణంలోని జేపీనగర్‌లో ఉన్న సాంఘిక సంక్షే మ శాఖ బాలుర గురుకుల పాఠశా లను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చే శారు. పాఠశాల పరిస్థితులు, విద్యా ర్థులకు అందుతున్న సౌకర్యాలను కలెక్టర్ పరి శీలించారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పె ట్టుకుని పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, మరు గుదొడ్లు నిర్వహణ, హాస్టల్ వసతులు వంటి అంశాలపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని క లెక్టర్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అందిస్తున్న విద్యా ప్రమాణాలను బోధన విధా నంపై కూడా ఆరా తీశారు. ఉపాధ్యాయులతో మాట్లాడి బోధన నాణ్యతను మరింత మెరుగు పర్చాలని సూచించారు. తనిఖీ అనంతరం కలె క్టర్ భోజన శాలకు వెళ్లి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులతో ప్ర త్యేకంగా మాట్లాడిన కలెక్టర్ వారి సమస్యలను, అవసరాలను తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్‌రెడ్డి, తహసీల్దార్ ఇబ్ర హీం, పాఠశాల ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
వంగూరు, (ఆంధ్రజ్యోతి) : వంగూరు రైతు వేదికలో జరిగిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశానికి కలెక్టర్ బదావ త్ సంతోష్ ముఖ్య అథితిగా హాజరైయ్యారు. క లెక్టర్ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యం లే కుండా ఏ కార్యక్రమం విజయవంతం కావడం సాధ్యం కాదన్నారు. 99 రోజుల ప్రజాపాలనా- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రజల స మస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కా రానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలి పారు. అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు. పెం డింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల ను వేగవంతం చేసి గృహప్రవేశాలు చేసేందు కు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం టీపీ ఎస్ స్కూల్ నిర్మాణ పనులను కలెక్టర్ పరి శీలించి, నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చే యాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. కార్యక్ర మంలో ప్రత్యేక అధికారి చంద్రకళ, సర్పంచ్ యాదయ్య, తహసీల్దార్ మురళీమోహన్, ఎం ఈవో కొండల్‌రెడ్డి, అసిస్టెంట్ నోడల్ అధికారి శశాంక్‌రెడ్డి పాల్గొన్నారు.