Share News

kumaram bheem asifabad- విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి

ABN , Publish Date - Jul 21 , 2026 | 10:32 PM

విద్యార్థులకు మెరుగైన విద్య, పోషకాహరం, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని గిరిజన సంక్షేమశాఖ జిల్లా అధికారి జాదవ్‌ అంబాజీ అన్నారు. ఆశ్రమ గిరిజన బాలికల పాఠశాలలో మంగళవారం నిర్వహించిన హెచ్‌ఎంలు, వసతి గృహ అధికారులు, ఎస్సీఆర్పీల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 52 ఆశ్రమ వసతి గృహల్లో విద్యార్థులకు ప్రతిరోజు నాణ్యమైన పోషకాహరం అందించడంతో పాటు పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడం ప్రతి అధికారి బాధ్యత అన్నారు.

kumaram bheem asifabad- విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి
మాట్లాడుతున్న గిరిజన సంక్షేమశాఖ జిల్లా అధికారి జాదవ్‌ అంబాజీ

ఆసిఫాబాద్‌రూరల్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు మెరుగైన విద్య, పోషకాహరం, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని గిరిజన సంక్షేమశాఖ జిల్లా అధికారి జాదవ్‌ అంబాజీ అన్నారు. ఆశ్రమ గిరిజన బాలికల పాఠశాలలో మంగళవారం నిర్వహించిన హెచ్‌ఎంలు, వసతి గృహ అధికారులు, ఎస్సీఆర్పీల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 52 ఆశ్రమ వసతి గృహల్లో విద్యార్థులకు ప్రతిరోజు నాణ్యమైన పోషకాహరం అందించడంతో పాటు పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడం ప్రతి అధికారి బాధ్యత అన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మధ్య విబేదాలకు తావులేకుండా కలిసి కట్టుగా పని చేయాలన్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌, ఎల్‌ఈఏపీ కార్యక్రమం వంద శాతం సాధించడమే లక్ష్యంగా ఎస్సీఆర్పీలు పని చేయాలని సూచించారు.. ప్రతి విద్యార్థి పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని చెప్పారు. నిర్ణీత గడువులోగా సిలబస్‌ పూర్తి చేయాలన్నారు. జీసీసీ ద్వారా సరఫరా అయ్యే బియ్యం, పప్పులు, నిత్యావసర సరుకులను పూర్తిగా పరిశీలించాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలు పాటించినవే తీసుకోవాలన్నారు. నాసిరకం సరుకులను ఎట్టి పరిస్థితుల్లోను తీసుకోవద్దని తెలిపారు. సమావేశంలో ఏసీఎంవో పుర్క ఉద్దవ్‌, జిల్లా క్రీడల అధికారి మడావి శేకు, జీసీడీవో కొట్నాక శకుంతల, ఏటీడీవోలు భాస్కర్‌, శ్రీనివాస్‌, చిరంజీవి, హెచ్‌ఎంలు, వసతి గృహ సంక్షేమాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 21 , 2026 | 10:32 PM