Share News

kumaram bheem asifabad- విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి

ABN , Publish Date - Feb 04 , 2026 | 10:30 PM

విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు మెనూ ప్రకారం మధ్యాహ్న బోజనం అందించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను బుధవారం కలెక్టర్‌ హరిత, ఐఎఫ్‌ఎస్‌ అధికారి భార్గవ్‌కుమార్‌తో కలిసి తనిఖీ చేశారు.వంట గదిని పరిశీలించి విద్యార్థుకు మధ్యాహ్న భోజనంలో ఏం వడ్డిస్తున్నారని హెచ్‌ఎంను అడిగి తెలుసుకున్నారు.

kumaram bheem asifabad- విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి
వాంకిడిలో విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిత

వాంకిడి, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు మెనూ ప్రకారం మధ్యాహ్న బోజనం అందించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను బుధవారం కలెక్టర్‌ హరిత, ఐఎఫ్‌ఎస్‌ అధికారి భార్గవ్‌కుమార్‌తో కలిసి తనిఖీ చేశారు.వంట గదిని పరిశీలించి విద్యార్థుకు మధ్యాహ్న భోజనంలో ఏం వడ్డిస్తున్నారని హెచ్‌ఎంను అడిగి తెలుసుకున్నారు. వంట సరుకుల నిలువ గదిని తనిఖీ చేశారు.. బియ్యం, కూరగా యలను పరిశీలించి గదిని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. పదో తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి వార్షిక పరీక్షలు ఎలా సిద్ధమవుతున్నారని అడిగి తెలుసుకున్నారు. పలు సలహాలు సూచనలు చేశారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని విద్యార్థులను అడిగారు. సరిపడా స్నానపు గదుఉల, టాయిలెట్స్‌ లేవని కలెక్టర్‌ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెనూ ప్రకారం ఆహారం అందించాలని, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, సంక్షేమాధికారులకు సూచించారు. అనంతరంమండల కేంద్రంలో నూతన అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి బాలింతలు, గర్భిణులకు సరైన పౌష్టికారం అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రం పరిసరాలను పరిశీలించారు. బాలింతలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పీహెచ్‌సీలో సరిపడ వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రేషన్‌ షాపును తనిఖీ చేశారు. స్టాక్‌ రిజిస్టర్లను నిల్వలతో సరిపోల్చి చూడాలని అధికారులను సూచించారు. రేషన్‌ కార్డు దారులకు సకాలంలో సరుకులు పంపిణీ చేయాలన్నారు. అనంతరం మండల కేంద్రం సమీపంలోని జీపీ పరిధిలోని గణేష్‌పూర్‌ గ్రామంలో కొనసాగుతున్న ఉపాధిహామీ పనులను డీఆర్‌డీవో భరత్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఉపాధి హామీ కూలీల మస్టర్‌ రోల్స్‌ను తనిఖీ చేశారు. ఎన్ని రోజులు పనులు కల్పిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. కూలీలకు నీడ, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. అనంతరం చౌపన్‌గూడ గ్రామంలో ఎంపీపీఎస్‌ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని సౌకర్యాలు, టాయిలెట్స్‌ నిర్వహణను పరిశీలించి పిల్లల హాజరు శాతం పెంచాలని సూచించారు. ఆమె వెంట డీఎఫ్‌వో భరత్‌కుమార్‌, ఎంపీడీవో జ్యోత్స్న తదితరులు ఉన్నారు.

ఈవీఎం గోదాం వద్ద పటిష్ఠ బందోబస్తు

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ యంత్రాల గోదాం వద్ద పటిష్ఠమైన బందోబస్తు చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలో ఈవీఎంలు భద్రపరిచిన గోదాంను నెల వారి తనిఖీలో భాగంగా బుధవారం అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, శిక్షణ ఐఎఫ్‌ఎస్‌ అధికారి భార్గవ్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మాట్లాడుతూ ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ యంత్రాలు భద్ర పరిచిన గోదాం వద్ద పటిష్ఠమైన బందోబస్తు చేపడుతున్నామని అన్నారు. సీసీ కెమెరాలు 24 గంటలు పర్యవేక్షించేలా ఏర్పాటు చేశామని చెప్పారు. సీసీ కెమెరాలు ఎల్లవేళలా పని చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 04 , 2026 | 10:30 PM