kumaram bheem asifabad- విద్యార్థులు గణితంలో పట్టు సాధించాలి
ABN , Publish Date - Nov 17 , 2026 | 10:32 PM
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాను అభ్యసి స్తున్న విద్యార్థులు గణితంలో పట్టు సాధించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకో వాలని కలెక్టర్ హరిత సూచించారు. మండల కేంద్రంలోని అర్జుగూడ ప్రాథమిక పాఠశాలను ఎస్ ఎల్ఎన్ పోటీలో భాగంగా మంగళవారం కలెక్టర్ తనిఖీ చేశారు
వాంకిడి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాను అభ్యసి స్తున్న విద్యార్థులు గణితంలో పట్టు సాధించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకో వాలని కలెక్టర్ హరిత సూచించారు. మండల కేంద్రంలోని అర్జుగూడ ప్రాథమిక పాఠశాలను ఎస్ ఎల్ఎన్ పోటీలో భాగంగా మంగళవారం కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో పఠన సామర్థ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన అందించాలన్నారు. గణిత సబ్జెక్టులో పట్టు సాఽధించేలా తీసివేతలు, కూడికలతో పాటు గణితానికి సంబంధించి ప్రతీఅంశంపై నైపుణ్యం సాధించేలా ఉపాధ్యాయులు బోధించాలని సూచించారు. ప్రత్యక తరగతులు నిర్వహించి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద వహించి వారి ప్రగతిని ఎప్పటిప్పుడు సమీక్షించాలని తెలిపారు. ఉపాధ్యాయులు విధుల పట్ల సమయపాలన పాటిస్తూ విద్యార్థులు 100 శాతం బడికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మోనూ ప్రకారం పౌష్టికరమైన మధ్యాహ్నబోజనం అందించాలన్నారు. విద్యార్థులకు భోజనర వసతితో పాటు వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. వివిధ ధ్రువపత్రాల కోసం మీసేవలో చేసుకున్న దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిర్ణిత గడువులోగా జారీ చేయాలని ఆదే శించారు. నివాస, ఆదాయ, కుల, కుటుంబ సభ్యులు ధుృవపత్రాలు ,కళ్యాణ లక్ష్మి, సాదీముబారక్, దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు.
ఆసిఫాబాద్, (ఆంధ్రజ్యోతి): ఓటరు చైతన్యం ద్వారా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఓటును వినియోగించుకొని ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎలకొ్ట్రరల్ లిటరసీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లో విద్యార్థులకు జిల్లా స్థాయి వ్యాసరచన, క్విజ్పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటిల్లో పాల్గొన్నారు. అనంతరం జిల్లాస్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఆర్డీవో లోకేశ్వర్రావు, విద్యాశాఖ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.