రోడ్డెక్కిన విద్యార్థులు
ABN , Publish Date - Feb 19 , 2026 | 05:03 AM
హాస్టళ్లలో నాణ్యమైన భోజనం అందడం లేదని వేర్వేరు చోట్ల విద్యార్థులు బుధవారం రోడ్డెక్కారు. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ పీజీ క్యాంప్‌సలోని హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం...
నాణ్యమైన భోజనం అందడం లేదని కొల్లాపూర్‌పీజీ విద్యార్థులు, వెల్దండ విద్యార్థినుల ఆందోళన
కొల్లాపూర్/వెల్దండ , ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): హాస్టళ్లలో నాణ్యమైన భోజనం అందడం లేదని వేర్వేరు చోట్ల విద్యార్థులు బుధవారం రోడ్డెక్కారు. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ పీజీ క్యాంప్‌సలోని హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదని హాస్టల్‌లో చేసిన టిఫిన్ గిన్నెతో సహా విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పురుగుల అన్నం తినలేక పస్తులుంటున్నా ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పట్టించుకోవడం లేదని వెల్దండ ఎస్సీ బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ఒక్కసారిగా పెద్దసంఖ్యలో స్థానిక హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాన రహదారిపైకి చేరుకొని రోడ్డుపై బైఠాయించారు. రాస్తారోకోతో పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సోషల్ వెల్ఫేర్ జోనల్ అధికారి విద్యుల్లత, తహసీల్దార్ కార్తీక్‌కుమార్‌లు పాఠశాలకు చేరుకొని సమస్యలను తెలుసుకున్నారు.