గణితం అంటే విద్యార్థులు భయం వీడాలి
ABN , Publish Date - Jul 17 , 2026 | 10:55 PM
గణితం అంటే విద్యార్థులు భయం వీడాలని ఆదనపు కలెక్టర్(స్థానిక సంస్థల). ఇన్‌చార్జి జిల్లా విద్యాధికారి పి చంద్రయ్య ఐపిఎస్ కోరారు.
అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి డీఈవో పి చంద్రయ్య
దండేపల్లి జూలై 17 (ఆంధ్రజ్యోతి): గణితం అంటే విద్యార్థులు భయం వీడాలని ఆదనపు కలెక్టర్(స్థానిక సంస్థల). ఇన్‌చార్జి జిల్లా విద్యాధికారి పి చంద్రయ్య ఐపిఎస్ కోరారు. శుక్రవారం ఆడుతూ పాడుతూ గణితం నేర్చు కుందామని మండలంలోని గుడిరేవు ప్రభుత్వ ప్రాథమిక ఫ్రైపైమరీ పాఠ శాలలోని రూపొందించిన ఓపెన్ మ్యాథ్స్ పార్కును ఆదనపు కలెక్టర్ చం ద్రయ్య, జిల్లా సెకోర్టియల్ అధికారిణి విజయలక్ష్మితో ప్రారంభించారు. ఆయ న మాట్లాడుతూ ఇటువంటి వినూత్న భోధన విధానాలు విద్యార్థుల్లో గణి తంపై ఆసక్తిని పెంపొందిస్తాయన్నారు. గణితంలోని వివిధ అంశాలపై అ నుభవాత్మకంగా నేర్చుకునే అవకాశాన్ని ఈ పార్క్ కల్పిస్తుందన్నారు. వి ద్యాశాఖ పాఠ్య ప్రణాళికకు అనుగుణంగా రైపొందించిన ఈ కార్యక్రమం అభినందనీయమన్నారు. ఉపాధ్యాయ బృందాన్ని ఈసందర్బంగా అభినం దించారు. జిల్లాలోని ఇతర పాఠశాలలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. విద్యార్థుల్లో గణితంపై ఉన్న భయాన్ని తొలగించి ఆటల ద్వారా గణితాన్ని సులభంగా నేర్చుకునేలా పాఠశాలలోని ఓపెన్ మ్యాథ్స్ పార్కును ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పాఠశాల ప్రధానోపాద్యాయుడు బొలిశెట్టి బుచ్చన్న 1నుంచి 5వ తరగతి విద్యార్థులకు గణిత పాఠ్యపుస్తకంలోని భావాలను సులభంగా అర్థం చేసుకునేలా ఈ ఓపెన్ మ్యాథ్స్ పార్క్‌ను రూపొందించారు. కార్యక్రమంలో జిల్లా సెక్టోరియ ల్ ఆఫీసర్ బంజోజు సత్తయ్య, జెండర్ ఈక్విట్ కో ఆర్డినేటర్ విజయలక్ష్మి, మండల విద్యాధికారి మంత్రి రాజు, సర్పంచ్ సంతపురి కళావతి, ప్రధానో పాధ్యాయుడు బొలిశెట్టి బుచ్చన్న, ఉపాధ్యాయురాలు శ్యామల, గ్రామ నా యకులు, గ్రామస్థులు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.