kumaram bheem asifabad- విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్తులు అందజేయాలి
ABN , Publish Date - Jul 24 , 2026 | 11:23 PM
ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదివే విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్తులు ఆగస్టు 25లోగా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు అన్నారు. హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, ఇతర అదికారులతో యూనిఫాం పంపిణీ, వర్షకాలం పంటల సాగు తదితర అంశాలపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, జూలై 24 (ఆంరఽధజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదివే విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్తులు ఆగస్టు 25లోగా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు అన్నారు. హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, ఇతర అదికారులతో యూనిఫాం పంపిణీ, వర్షకాలం పంటల సాగు తదితర అంశాలపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు యూనిఫాం అందించాలన్నారు. ఈ క్రమంలో దుస్తుల సరఫరా విద్యార్థుల కొలతలు, మాస్టారు టైలర్లు, స్వయం సహాయక సంఘాల మహిళలకు దుస్తులు కుట్టేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వరికి బదులు ఆరుతడి పంటల సాగువైపు రైతులకు అవగాహన కల్పించి ప్రొత్సహించాలని సూచించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ కె హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, డీఈవో సచ్చిదానందచారి, డీపీవో భిక్షపతి, డీఆర్‌డీవో దత్తారావు, డీఏవో వెంకటి, సీఈవో లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.