అడ్మిషన్ టెస్ట్‌ల పేరుతో విద్యార్థులకు గాలం
ABN , Publish Date - May 17 , 2026 | 11:19 PM
రాష్ట్ర వ్యాప్తంగా మరో 20 రోజుల్లో పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. ఇప్పటి నుంచే ప్రైవేట్ పాఠశా లల యాజమాన్యాలు అడ్మిషన్ల పేరుతో హడావుడి చేస్తున్నాయి
-ప్రైవేటు పాఠశాలల్లో ప్రారంభమైన చేరికలు
-పుస్తకాలతో సహా అన్ని వస్తువులూ కొనాల్సిందే
-పోషకులను సమాయత్తం చేస్తున్న యాజమాన్యాలు
-సామాన్యులకు భారంగా మారిన ప్రైవేట్ విద్య
మంచిర్యాల, మే 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా మరో 20 రోజుల్లో పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. ఇప్పటి నుంచే ప్రైవేట్ పాఠశా లల యాజమాన్యాలు అడ్మిషన్ల పేరుతో హడావుడి చేస్తున్నాయి. ఓ వైపు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రభుత్వం శిక్షణ తరగతులు ని ర్వహిస్తుండగా, ప్రైవేట్ స్కూళ్లలో మాత్రం అడ్మిషన్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికల కోసం బడిబాట కార్యక్రమం ప్రారంభించే లోపే వీలైనంత ఎక్కువగా అడ్మిషన్లు సేకరించా లనే లక్ష్యంతో ప్రైవేట్ యాజమాన్యాలు ఉన్నాయి. పాఠశాలలు పున:ప్రా రంభమయ్యే నాటికి సరిపడా సంఖ్యలో విద్యార్థులను చేర్చుకొనే పనిలో ని మగ్నమయ్యాయి. అడ్మిషన్ టెస్ట్‌ల పేరుతో విద్యార్థులను చేర్చుకొనే కార్య క్రమానికి శ్రీకారం చుట్టగా, వారు మరో పాఠశాలవైపు ఆకర్షితులు కా కుండా ముందస్తుగా పుస్తకాలు, యూనిఫాం, తదితర వస్తువులను అంట గడుతున్నారు. జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండగా ఇ ప్పటి నుంచే విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం ఇప్పటి నుంచే సమాయత్తం కావలసిన పరిస్థితులు నెలకొన్నాయి.
చుక్కలనంటుతున్న ధరలు...
పాఠశాలల విద్యార్థులకు అవసరమయ్యే వస్తువులు ధరలు చుక్కలనంటుతున్నాయి. అనేక చోట్ల పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు మొదలుకొని, బూట్ల వరకు విక్రయిస్తూ అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బయట మార్కెట్‌తో పోల్చితే పాఠశాలల్లో విక్రయించే వివిధ సామగ్రి ధరలు అధికంగా ఉంటున్నాయనే అభిప్రాయాలు ఉన్నా యి. పుస్తకాలతో సహా విద్యార్థి ధరించే యూనిఫాం, సాక్స్, బూట్లు, బె ల్టుపై తమ పాఠశాల పేరే ఉండాలనే నిబంధన ఉండటంతో తల్లిదం డ్రులు ధరలు ఎక్కువైనా కొనక తప్పని పరిస్థితులు కల్పిస్తున్నారు. కుటుంబంలో ఇద్దరు పాఠశాలకు వెళ్లే పిల్లలు ఉన్న చోట రూ. 15 వేల నుంచి 20 వేల వరకు కేవలం సామగ్రి కొనుగోలుకే వెచ్చించాల్సి వస్తుం దని పలువురు పోషకులు వాపోతున్నారు. యాజమాన్యాల వైఖరితో మ ద్యతరగతి వర్గాల ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమంలోనూ పూర్తి ఉచిత బోధన లభిస్తున్నప్పటికీ చ దువులో నాణ్యత ఉండదనే భావనతో అత్యధిక మంది పోషకులు అష్టక ష్టాలు పడి తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలోనే చేర్పిస్తున్నట్లు తెలుస్తోంది.
సామాన్యులకు భారంగా....
విద్యార్థుల తల్లిదండ్రుల అవసరాన్ని అవకాశంగా మలుచుకుంటున్న కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారీతిన అడ్డగోలుగా ఫీజులు వ సూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫీజుల నియంత్రణపై ప్రభుత్వ పరంగా ఎలాంటి కట్టుదిట్టమైన అజమాయిషీ లేకపోవడంతో యాజమాన్యాలు ఆడిందే ఆటగా సాగుతోంది. ఆంగ్ల మాద్యమంలో ఎల్‌కేజీ అ భ్యసించే విద్యార్థికి సంవత్సరానికి కనీసం రూ. 25 వేలు వసూలు చేస్తుండగా ప్రైమరీ తరగతుల స్కాలర్‌కు రూ. 25 వేల నుంచి 50 వేలు వసూలు చేస్తున్నారు. దీంతో పాటు వేలల్లో అడ్మిషన్ ఫీజులు సైతం వసూలు చేస్తూ తల్లిదండ్రుల నడ్డీ విరిస్తున్నారు. హాస్టళ్లలో ఉండి చదువుకొనే వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. సంవత్సరానికి ఒక్కో విద్యార్థికి రూ. 80 వేల పైననే వసూలు చేస్తున్నారు. దీంతో పాటు కొన్ని పాఠశాల ల్లో నోటు పుస్తకాలు, టెక్ట్స్ బుక్కులు, యూనిఫాంలు, సాక్సులు, టీషర్ట్‌లు అమ్ముతూ అక్రమంగా వ్యాపారం చేస్తున్నారు. పుస్తకాలు, యూనిఫాంలు, సాక్సులపై తమ పాఠశాలల పేర్లు ముద్రిస్తూ వాటినే కొనుగోలు చేయాలని హుకుం జారీ చేస్తున్నారు.
కనీస సౌకర్యాల కల్పించడంలో విఫలం......
వేల రూపాయల్లో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల యా జమాన్యాలు విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంలో విఫలమయ్యాయనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. వ్యాపార ధోరణనే తప్ప విద్యార్థుల బాగోగులు పట్టించుకోవడం లేదని సమాచారం. జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రైవేట్ పాఠశాలలు ఉండగా చాలా వాటికి విద్యార్థులు ఆడుకునేందుకు ఆటస్థలం లేకపోవడం శోచనీయం. రెండు మూడంతస్థుల్లో పాఠశాలలు నడుపుతూ విద్యార్థులను క్రీడలకు దూరం చేస్తున్నా అడిగేవారు కరువాయ్యారు. ప్లే స్కూళ్ల పేరిట పాఠశాలలు నిర్వహిస్తూ ప్రీ ప్రైమరీ తరగతుల విద్యార్థులకు ఇరుకు గదిలో ఆట వస్తువు లు ఏర్పాటు చేసి కుక్కుతున్నారు. ఆ గదుల్లో కనీసం గాలి వీచే సౌకర్యాల లేకపోవడం విచారకరం.
నిబంధనలు అమలయ్యేనా...?
2026-27 విద్యా సంవత్సరం ఆరంభం కానుండగా, ప్రైవేట్ స్కూళ్లలో నిబంధనలు అమలయ్యేలా చర్యలు చేపట్టవలసిన బాధ్యత విద్యాశాఖ అ ధికారులపై ఉంది. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యను వ్యాపా రంగా మార్చి తల్లిదండ్రులను నిలువు దోపిడీకి గురి చేస్తున్నందున ని బంధనలపట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పాఠశాలలు విధిగా ప్రభుత్వ గుర్తింపు పొంది ఉండటం, క్రీడా మైదానం ఏర్పాటు, అగ్నిమాపకశాఖ పరికరాల ఏర్పాటు విషయంలో వెసులుబాటు కల్పించవద్దనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తవుతున్నాయి.