విద్యార్థుల సామర్థ్యాలే విద్యా ప్రమాణాలకు కొలమానం
ABN , Publish Date - Sep 09 , 2026 | 11:32 PM
విద్యార్ధుల అభ్యసనా సామర్ధ్యాలే పాఠశా లల్లో విద్యా ప్రమాణాలకు కొలమానమని జిల్లా విద్యాశాఖాధికారి రమేశ్ కుమార్ అన్నారు.
- డీఈవో రమేశ్ కుమార్
నాగర్‌కర్నూల్‌టౌన్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యో తి) : విద్యార్ధుల అభ్యసనా సామర్ధ్యాలే పాఠశా లల్లో విద్యా ప్రమాణాలకు కొలమానమని జిల్లా విద్యాశాఖాధికారి రమేశ్ కుమార్ అన్నారు. బు ధవారం జిల్లా కేంద్రంలోని సంజయ్‌నగర్‌కాలనీ, ఉయ్యలవాడ ప్రాథమికోన్నత పాఠశాలలను ఆ యన తనిఖీ చేశారు. గణితం, ఇతర సబ్జె క్లుల్లో వారి అభ్యసనా సామర్థ్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి జీసీడీవో నిర్మల, ఇన్ చార్జి డీఎస్‌ఓ శైలజ, ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రత్యేక అవసరాల పిల్లలను ప్రోత్సహించాలి
ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను తల్లి దండ్రులు భారంగా భావించకుండా, ప్రభుత్వం అందిస్తున్న విద్య, శిక్షణ, సంక్షేమ సదుపా యా లను సద్వినియోగం చేసుకుని అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించా లని జిల్లా విద్యాశాఖాధికారి రమేష్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని డీకేఆర్ ఫంక్షన్ హాలు లో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాల పిల్లల తల్లిదం డ్రులకు అవగాహన సదస్సు నిర్వ హించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈవో హాజరై మాట్లాడా రు. జిల్లాలోని 2,514 మంది ప్రత్యేక అవసరాల విద్యార్థుల కోసం 20ఐ ఆర్‌పీలు, 55మంది ప్రత్యేక ఉపాధ్యా యులు సేవలు అందిస్తున్నారని తెలి పారు. కార్యక్రమంలో విద్యాశాఖ నోడల్ అధికారి కురుమయ్య, ఎండీఈవో కిరణ్‌కుమార్, ఏఎస్‌ఓ మాధవరెడ్డి, డీఎస్‌ఓ శైలజ, జీసీడీవో నిర్మల, ఐఆర్‌పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.