Share News

kumaram bheem asifabad- విద్యార్థుల హాజరు శాతం పెంచాలి

ABN , Publish Date - Oct 01 , 2026 | 10:46 PM

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతా న్నిపెంచాలని జిల్లా కలెక్టర్‌ కె హరిత అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, డీఈవో సచ్చిదానందచారి, ఎంఈవోలు, హెచ్‌ఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సమగ్ర శిశు అభియాన్‌లో జిల్లా ర్యాంకు తక్కువగా ఉందని విద్యార్థులు ఉపాధ్యాయుల హజరు శాతం తక్కువ నమోదు అయిందని తెలిపారు.

kumaram bheem asifabad- విద్యార్థుల హాజరు శాతం పెంచాలి
:పోస్లర్లను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ హరిత, పాల్గొన్న అధికారులు

ఆసిఫాబాద్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతా న్నిపెంచాలని జిల్లా కలెక్టర్‌ కె హరిత అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, డీఈవో సచ్చిదానందచారి, ఎంఈవోలు, హెచ్‌ఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సమగ్ర శిశు అభియాన్‌లో జిల్లా ర్యాంకు తక్కువగా ఉందని విద్యార్థులు ఉపాధ్యాయుల హజరు శాతం తక్కువ నమోదు అయిందని తెలిపారు. పీఎంశ్రీ పాఠశాలల్లో మౌలిక వసతులు వంటి వివరాలను యూడైస్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని తెలిపారు. కొన్ని పాఠశాలల్లో తరచుగా అనుమతి లేకుండా పాఠశాలలకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయులను గుర్తించి వారికి షోకాజ్‌ నోటిసులు జారీ చేయాలని తెలిపారు. ఎంఈవోలు కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు తమ పరిధిలోని పాఠశాలలను తరచుగా సందర్శించాలని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాభోదన అందించాలన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హజరు శాతంలో పురోగతి సాదించలన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

సౌర విద్యుత్‌ వినియోగించాలి

సౌర విద్యుత్‌ వినియోగంతో పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని కలెక్టర్‌ కె హరిత అన్నారు. గురువారం కలెక్టరేట్‌ అవరణలో ప్రధానమంత్రి సూర్య ఘార్‌ ముక్త్‌ బిజిలీ యోజన కింద సౌర విద్యుత్‌ వినియోగంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌తో కలిసి హజరయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘార్‌ ముక్త్‌ బిజిలీ యోజన పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిందని ఈ పథకం ద్వారా గృహవిద్యుత్‌ వినియోగదారులు తమ ఇండ్ల రూప్‌టాప్‌పై సోలార్‌ ప్లాంట్‌ను ఏర్పాటుచేసుకొవడంతో ప్రతినెల 360 యూనిట్ల వరకు విద్యుత్‌ను పొందవచ్చని తెలిపారు. సోలార్‌ వినియోగం ద్వారా విద్యుత్‌ బిల్లులను తగ్గించవచ్చని అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరు సోలార్‌ విద్యుత్‌పై అవగాహన పెంచుకొనివినియోగించుకునేల ఏర్పాటు చేసుకొవలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ ఉత్తమ్‌జాడే, ఏడీఈ శ్రీనివాస్‌, ఏఈలు లక్ష్మిరాజం, ఫిరోజ్‌ఖాన్‌, ఏవో దేవిదాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2026 | 10:46 PM