Share News

ఎస్టీయూ పోరాటాల వల్లే టీచర్లకు హక్కులు

ABN , Publish Date - Jun 10 , 2026 | 04:27 AM

స్టేట్‌ టీచర్స్‌ యూనియన్‌ (ఎస్టీయూ) చేసిన పోరాటాల వల్లే నేడు రాష్ట్రంలోని ఉపాధ్యాయులు అనే హక్కులు, సౌకర్యాలు పొందుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి...

ఎస్టీయూ పోరాటాల వల్లే టీచర్లకు హక్కులు

  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి

  • ఘనంగా ఎస్టీయూ 80వ ఆవిర్భావ వేడుక

హైదరాబాద్‌, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): స్టేట్‌ టీచర్స్‌ యూనియన్‌ (ఎస్టీయూ) చేసిన పోరాటాల వల్లే నేడు రాష్ట్రంలోని ఉపాధ్యాయులు అనే హక్కులు, సౌకర్యాలు పొందుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, ప్రభుత్వ విద్యా వ్యవస్థ పరిరక్షణే ధ్యేయంగా ఎస్టీయూ 80 ఏళ్లుగా నిరంతరం పని చేస్తున్నదని ప్రశంసించారు. హైదరాబాద్‌లోని ఎస్టీయూ భవన్‌లో ఆ సంస్థ 80వ ఆవిర్భావ వేడుకను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి హాజరైన చాడ వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ..స్వాతంత్ర్యానికి పూర్వం ఏర్పాటైన తొలి ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూ అని అన్నారు. గతంలో ఎస్టీయూ రాష్ట్ర బాధ్యులైన రాఘవాచారి, శ్యాంసుందర్‌ రావు లాంటి నేతలు ఎమ్మెల్సీలుగా ఎన్నికై పదవులకే వన్నె తెచ్చారని గుర్తుచేశారు. ఇక, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి జి.సదానందం గౌడ్‌, జుట్టు గజేందర్‌ మాట్లాడుతూ.. నూతన ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీం అమలు చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ వెంటనే ప్రకటించాలని, సీపీఎస్‌ రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ పూర్వ అధ్యక్షులు ఎం.పర్వత్‌ రెడ్డి, ఆర్‌.శివశంకర్‌, కరుణాకర్‌ రెడ్డి, సీనియర్‌ నాయకులు బషీరొద్దీన్‌, మహమ్మద్‌ అలీ, జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2026 | 04:27 AM