kumaram bheem asifabad- జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పోరాటం
ABN , Publish Date - Oct 07 , 2026 | 10:43 PM
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నామని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాలులో బుధవారం నిర్వహించిన టీయూడబ్ల్యూజే(ఐజేయూ) తృతీయ మహాసభలకు జిల్లా కలెక్టర్ హరిత, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రకాష్‌రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆసిఫాబాద్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నామని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాలులో బుధవారం నిర్వహించిన టీయూడబ్ల్యూజే(ఐజేయూ) తృతీయ మహాసభలకు జిల్లా కలెక్టర్ హరిత, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రకాష్‌రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు జిల్లాలో మృతి చెందిన జర్నలిస్టులు అత్రం తుకారాం, శ్రీధర్‌ల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విరాహత్ ఆలీ మాట్లాడుతూ 75 సంవత్సరాలుగా జర్నలిస్టుల హక్కుల కోసం పోరాటాం చేస్తున్నామన్నారు. జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, హెల్త్‌కార్డుల జారీతో పాటు జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందించాలనే డిమాండ్లతో పోరాటం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర అవిర్భావం తర్వాత ఎన్నో సంఘాలు పుట్టుకు వచ్చాయని వివరించారు. ప్రస్తుతం వాటి పుట్టుకే ప్రశ్నార్థకంగా మారిందన్నారు. అంతకు ముందు జిల్లాలోని పలువురు జర్నలిస్టులు మాట్లాడిన సమస్యలపై స్పందిస్తూ కష్టం ఉన్నచోటే తమ సంఘం ఉంటుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకుంటే కుమరం భీం స్ఫూర్తితో పోరాడుతామన్నారు. అనంతరం కలెక్టర్ హరిత మాట్లాడుతూ అధికారులు, జర్నలిస్టులు సమన్వయంతో పనిచేసినప్పుడే జిల్లా అభివృద్ది సాధ్యమవుతుందన్నారు. సమాజంలో జరుగుతున్న తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తి చూపాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందని చెప్పారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. అనంతరం కలెక్టర్‌ను సంఘ నాయకులు సన్మాననించారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ రహెమాన్, సంపత్‌కుమార్, కోశాధికారి సతీష్, జర్నలిస్టులు పాల్గొన్నారు.
టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా కార్యవర్గం
టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా నూతన కార్యవర్గాన్ని బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన తృతీయ మహాసభలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విరాహత్ ఆలీ, రాంనారాయణల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా అబ్దుల్ రహెమాన్, ప్రధాన కార్యదర్శిగా ఎస్ సంపత్‌కుమార్, కోశాధికారిగా అడప సతీష్, జిల్లా ఉపాధ్యక్షులుగా వారణాసీ శ్రీనివాస్‌రావు, నవీన్‌గౌడ్, చంద్రకాంత్, మేకల శ్రీనివాస్, భుక్య గిరిజపరుశురాం ఎన్నికయ్యారు. జిల్లా సహాయ కార్యదర్శులుగా కడతల సాయి, చిలుకూరి రాధాకృష్ణ, గోపి, రామేశ్వర్, ఆహ్మద్‌పాషా, సంయుక్త కార్యదర్శులుగా టి అముల్‌గౌడ్, రాజు, మహేష్, ఎండి నౌషద్, దేవునూరి రమేశ్, కార్యవర్గ సభ్యులుగా కాంబ్లె అన్నారావు, పోచయ్య, తిరుపతి, కమలాకర్, బాలప్రసాద్‌గౌడ్, రోహిదాస్, సాయిసృజన్, అహ్మద్ అమీన్, రాథోడ్ రమేశ్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని సన్మానించారు.