బీజేపీ ప్రజావ్యతిరేక విధాలపై పోరాటం
ABN , Publish Date - Oct 04 , 2026 | 12:25 AM
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అధ్యక్షతన కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం ఇండియా కూటమి పార్టీల సమావేశం జరిగింది. ఈ నెల 8న
సిరిసిల్ల టౌన్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అధ్యక్షతన కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం ఇండియా కూటమి పార్టీల సమావేశం జరిగింది. ఈ నెల 8న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ఓట్ బచావ్ - దేశ్ బచావో ర్యాలీ కార్యక్రమ నిర్వహణపై సమావేశంలో చర్చించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ మాట్లాడారు. దేశంలో జరుగుతున్న ఓటు చోరీపై ఇండియా కూటమి ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటాన్ని కొనసాగించడంలో భాగంగా సెప్టెంబరు 30న న్యూ ఢిల్లీలో జాతీయ ఇండియా కూటమి పార్టీల సమావేశం జరిగిందన్నారు. బీజేపీ ప్రభుత్వ నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ సేవ్ డెమోక్రసీ వీక్ పేరుతో ఓట్ బచావో - దేశ్ బచావో అనే నినాదంతో అక్టోబర్ 2 నుంచి 8 వరకు ప్రజలను చైతన్య పరస్తూ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించడం జరిగిందన్నారు. అందులో భాగంగా జిల్లాలో అక్టోబరు 8న జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి అంబే ద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించాలన్నారు. ఇండియా కూటమి పార్టీల నాయకులు అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ సమావేవంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్, సీపీఐ జిల్లా కార్యదర్శి మూషం రమేష్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ, కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రియాజ్, నాయకులు శివప్రసాద్, రాకేష్, ప్రశాంత్, షేక్ బాబుఆలీ పాల్గొన్నారు.