Share News

జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి

ABN , Publish Date - May 20 , 2026 | 11:09 PM

ర్వాసితుల జీవన ప్రమాణాల మెరుగుదలే ల క్ష్యంగా అమ్రాబాద్‌ గ్రామాల పునరావాసానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అన్నారు.

జీవన ప్రమాణాల   మెరుగుదలకు కృషి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

- కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

నాగర్‌కర్నూల్‌, మే 20 (ఆంధ్రజ్యోతి) : ని ర్వాసితుల జీవన ప్రమాణాల మెరుగుదలే ల క్ష్యంగా అమ్రాబాద్‌ గ్రామాల పునరావాసానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అన్నారు. కోర్‌ ఏరియాలోని గ్రామాల తరలింపు, భూ పట్టాల పంపిణీ, తొలివిడత నష్ట పరిహారం, చెల్లింపులు, పునరావాస కేంద్రాల అభివృద్ధి అంశాలపై బుధ వారం జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి రేవంత్‌ చంద్రతో కలిసి కలెక్టర్‌ వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పెద్దకొత్త పల్లి మండలంలో ప్రతిపాదించిన పునరావాస కేంద్రాన్ని అన్ని మౌలిక సదుపాయాలతో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పునరా వాస కుటుంబాలకు గృహనిర్మాణ స్థలాలు కేటా యించడంతో పాటు పట్టాల పంపిణీ ప్రక్రియ ను వేగవంతం చేయాలని సూచించారు. నల్ల మల అటవీ ప్రాంతంలోని టైగర్‌ రిజర్వ్‌ కోర్‌ ఏరియా గ్రామాల కమిటీ సభ్యులు, నిర్వాసితుల పేర్లపై గృహ నిర్మాణ భూప ట్టాలను వెంటనే జారీ చేయాలని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌, కమిటీ ఆమోదం అనంతరం అవ సరమైన అన్ని చర్యలు వే గంగా చేపట్టాలని సంబంధి త అధికారులను ఆదేశించారు. రాబోయే 30రో జుల్లో లబ్ధిదారుల పేర్లపై భూ పట్టాలు అందిం చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చా రు. అదేవిధంగా తొలివిడత నష్ట పరిహారం చె ల్లింపుల ప్రక్రియ కూడా పారదర్శకంగా వేగవం తంగా పూర్తి చేయాలని అధికారులకు సూచిం చారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి రేవంత్‌చంద్ర, వివిధ శాఖల అధికారులు, ఆర్డీవో లు, ఆయా గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఉపాధి పనులకు ప్రత్యేక చర్యలు

నాగర్‌కర్నూల్‌లో ఉపాధి హామీ పనులకు వేసవి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పా టిల్‌ తెలి పారు. ఉపాధి హామీ పథకం చేయూ త పింఛన్ల అమలుపై హైదరాబాద్‌ నుంచి వీడి యో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ దివ్యరంగరాజన్‌, జిల్లాల కలెక్టర్లు, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించా రు. కలెక్టరేట్‌ వీడియో సమావేశ మందిరం నుంచి అదనపు కలెక్టర్‌ దేవసహాయం, సం బంధిత శాఖల అధికారులతో కలిసి కలెక్టర్‌ పా ల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పనులు సమర్థవంతంగా కొనసాగుతు న్నాయని తెలిపారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కూలీలకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. జిల్లాలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల పురోగతి, చేయూత పింఛన్ల పం పిణీ పరిస్థితులపై కూడా కలెక్టర్‌ సమీక్షించి సంబంధిత వివరాలు వెల్లడించారు.

Updated Date - May 20 , 2026 | 11:09 PM