ఆదివాసీల సంక్షేమానికి కృషి
ABN , Publish Date - Aug 09 , 2026 | 11:21 PM
ఆదివాసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అన్నారు.
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు
మంచిర్యాల కలెక్టరేట్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి) : ఆదివాసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అన్నారు. ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాలలో చేపట్టిన ఆదివాసీల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి ఎమ్మెల్యే మాట్లాడారు. ఆదివాసీల సంక్షేమానికి ప్ర భుత్వం కట్టుబడి ఉందని, ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవా ల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆదివాసీల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభు త్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. అనంతరం పద్మనాయక కళ్యాణ మండ పంలో సమావేశం నిర్వహించారు. గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి మాట్లాడు తూ ఆదివాసీలు అడవులు, ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరు ఆదివాసీల ఐక్యతకు కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీల సం క్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తుందని, వారి సంక్షేమానికి ప్రత్యేక కార్యచరణ రూపొందించిందన్నారు. ఆదివాసీలు ఐక్యంగా పోరాడి హక్కులను సాధిం చుకోవాలన్నారు. కగార్ లాంటి సంగటనలు పునరావృతం కాకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివాసీల సమస్యలపై దశల వారీగా సీఎం రేవంత్‌రెడ్డికి విన్న విస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ జిల్లా నాయకులు అర్జున్, లక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు గోపాల్‌రావు, ఆదివాసీలు పాల్గొన్నారు.