Share News

నియోజకవర్గ అభివృద్థికి కృషి

ABN , Publish Date - Sep 13 , 2026 | 11:24 PM

మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షే మానికి అభివృద్థి కార్యక్రమాలను చేపడతానని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు.

నియోజకవర్గ అభివృద్థికి కృషి
కమ్యూనిటీ హాల్‌ భవన నిర్మాణ పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు

-ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు

మంచిర్యాలక్రైం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షే మానికి అభివృద్థి కార్యక్రమాలను చేపడతానని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. ఆదివారం 14వ డివిజన్‌ పాత మంచిర్యాలలో అతి పురాతమైన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ రామాలయం -శివా లయం-భక్త ఆంజేనయస్వామి దేవస్ధానం ప్రాంగణంలో రూ. 30 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామాలయం వంటి పవిత్రమైన దేవస్ధాన ప్రాంగణంలో కమ్యూనిటీ హాల్‌ నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆలయానికి 12 గుంటల భూమిని ఇచ్చిన వారిని అభినందించారు. అనంతరం కుమ్మ రి సంఘం ఆధ్వర్యంలో తయారు చేసిమట్టి గణపతి విగ్రహాలను ఎమ్మెల్యే భక్తులకు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరు మట్టి గణపతులను పూజించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీసీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల కార్పోరేషన్‌ మేయర్‌ ధర్ని మధుకర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బానేష్‌, మాజీ వైస్‌ చైర్మన్‌ సల్ల మహేష్‌, నాయకులు సుధీర్‌, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2026 | 11:24 PM