Share News

kumaram bheem asifabad- జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి

ABN , Publish Date - Aug 15 , 2026 | 11:23 PM

రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు అధికారుల సమన్వయంతో జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నా మని శాసనమం డలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాష్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్‌ హెడ్‌క్వా ర్టర్‌లోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.

kumaram bheem asifabad- జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
జాతీయ జెండాకు వందనం చేస్తున్న శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాష్‌

- ప్రజాప్రభుత్వంలో అన్ని వర్గాలకు పెద్దపీటఆసిఫాబాద్‌/ఆసిఫాబాద్‌రూరల్‌, ఆగస్టు 15 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు అధికారుల సమన్వయంతో జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నా మని శాసనమం డలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాష్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్‌ హెడ్‌క్వా ర్టర్‌లోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. కలెక్టర్‌ కె హరిత, ఎస్పీ నితికా పంత్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా బండ ప్రకాష్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో వీరుల త్యాగఫలితంగానే భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. అమరుల స్ఫూర్తి తో రాష్ట్రంలోని అన్ని వర్గాల సర్వతోముఖాభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు.. స్వాతంత్య్ర సాధనలో ఎన్నో కష్టనష్టలకు ఒర్చి తమ సర్వసాన్ని త్యాగం చేసి దేశభక్తికి ప్రతీకగా నిలిచిన మహనీయులను స్మరించుకోవడం మనవిది అన్నారు.

ప్రజల సంక్షేమం..

ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృధ్ధే ధ్యేయంగా ప్రభు త్వం ప్రజల అకాంక్షల మేరకు ఎన్నో పథకాలను చేపట్టి అమలు చేస్తుందన్నారు. మహలక్ష్మి పథకం ద్వారా మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడికైన ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం కల్పించడంతో జిల్లాలో ఇప్పటి వరకు 2.41 కోట్ల మంది మహిళ ప్రయాణికులకు రూ. 88 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. గృహజ్యోతి పథకం కింద జిల్లాలో 83,684 కుటుం బాలకు రూ. 55.53 కోట్ల రాయితీ లబించిందన్నారు. దర్తీ అబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష్‌ పథకం ద్వారా జిల్లాలో 982 ఎస్టీ తెగలకు చెందిన లబ్దిదారుల గృహలకు ఉచితంగా విద్యుత్‌ సౌకర్యం కల్పించడంతో పాటు 738 అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించామని చెప్రాపు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద జిల్లాలో 8396 మంది పేదలకు వైద్య చికిత్సలు అందించడం జరిగిందన్నారు. రైతు భరోస పథకం ద్వారా జిల్లాలో వానకాలం సీజన్‌లో 1,33,860 మంది రైతులకు రూ. 250 కోట్ల వారి ఖాతాలో జమచేశామని చెప్పారు. రైతు బీమా పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 470 మంది రైతులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున రూ. 23.5 కోట్లు అందించామని చెప్పారు. ఇందిరమ్మ పథకంలో భాంగా జిల్లాకు 8,798 ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు. 70 ఇళ్లు పూర్తి కాగా మిగతా ఇండ్లు వివిధ దశలలో ఉన్నాయన్నారు. జిల్లాలో 1,65,000 మంది రేషన్‌కార్డు కుటుంబాలకు స్మార్టు రేషన్‌కార్డులను పంపిణీ చేయనున్నాని చెప్పారు. ప్రభుత్వం విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. విద్యాభివృద్దికి ఎన్నో నిధులు మంజూరు చేస్తుందన్నారు. విద్యార్థులకు సన్న బియ్యంతో మధ్యాహ్న బోజనాన్ని అందిస్తుందన్నారు. రూ. 200 కోట్ల అంచనా వ్యయంతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ నిర్మాణం కొరకు జిల్లాలోని అంకుశాపూర్‌ గ్రామంలో 17.24 ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందని పెర్కొన్నారు. ఇందిర మహిళ శక్తి పథకంలో భాగంగా ఇందిర మహిళ శక్తి క్యాంటీన్లు, పెట్రోల్‌ బంకులు, ఆర్టీసీలో అద్దెబస్సుల ద్వారా మహిళ సాధికారతతో సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండె విఠల్‌, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్లు యువరాజ్‌ మర్మాట్‌, డేవిడ్‌, ఏఎస్పీ చిత్తరంజన్‌, డీఆర్వో వేణు, ఆర్డీవోలు లోకేశ్వర్‌రావు, కృష్ణయ్య, గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ అనిల్‌కుమార్‌, మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ మంగ, మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఆకాష్‌, అహ్మద్‌, డీఎస్పీలు అశోక్‌, వహిదోద్దిన్‌, సింగిల్‌ విండో ఛైర్మన్‌ ఆలీబీన్‌ ఆహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు..

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలకు చెందిన విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జిల్లా కేంద్రంలోని ఆదర్శ క్రీడా పాఠశాల విద్యార్థులు, పోస్టు మెట్రిక్‌ విద్యార్థులు, సిర్పూర్‌(యూ) తెలంగాణ ఆదర్శ పాఠశాల, వాంకిడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, వాంకిడి ఆశ్రమోన్నత పాఠశాల, కేజీబీవీ కాగజ్‌నగర్‌ విద్యార్థులు చేపట్టిన దేశభక్తి నృత్యాలు అలరించాయి.

స్టాళ్ల పరిశీలన..

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో ఆయా శాఖలు స్టాళ్లను ఏర్పాటు చేశారు. గ్రామీణాభివృద్ధి శాఖ, ఉద్యాన పట్టు పరిశ్రమశాఖ, గిరిజన సంక్షేమశాఖ, పాఠశాల విద్యాశాఖ, అటవీశాఖ, పట్టణ పేదరిక నిర్మూలన, వైద్య ఆరోగ్యశాఖ, మత్స్యశాఖ, జిల్లా పశుసంవర్థకశాఖలు స్టాళ్లను ఏర్పాటు చేశారు. డిప్యూటీ చైర్మన్‌ బండప్రకాష్‌, కలెక్టర్‌ కె హరిత, ఎస్పీ నితికా పంత్‌, ఎమ్మెల్యే కోవలక్ష్మి, అదనపు కలెక్టర్లు యువరాజ్‌ మర్మాట్‌, డేవిడ్‌ తదితరులు స్టాళ్లను పరిశీలించారు.

కాగజ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ పట్టణంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఆయా శాఖల అధికారులు ఆవిష్కరించారు. సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌ బాబు గాంధీ పిల్లల ఉద్యాన వన కేంద్రంతో పాటు పలు చోట్ల జాతీయ జెండా ఎగురవేశారు. ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌, సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుళ్లపల్లి ఆనంద్‌ కుమార్‌తో పాటు ఆయా పార్టీల నాయకులు పలు చోట్ల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అన్నీ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే మండలంలోని అన్నీ ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఎగురవేశారు.

సిర్పూరు(టి), (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్‌ రహీమోద్దీన్‌, ఎంపీడీవో కె.ప్రసాద్‌, సిర్పూరు(టి) జూనియర్‌ సివిల్‌ న్యాయ స్థానంలో జడ్జి అజయ్‌ ఉల్లం, సర్పంచు నాగమణి, ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాస్‌, ఎస్సై సాగర్‌ పాల్గొని జెండా ఎగురవేశారు. సిర్పూరు(టి) న్యాయమూర్తి అజయ్‌ ఉల్లం కోర్టు నుంచి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వరకు న్యాయ విజ్ఙాన సదస్సు ర్యాలీ నిర్వహించారు.

చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో సత్యనారాయణ, తహసీల్దార్‌ ప్రకాష్‌, ఎస్సై కమలాకర్‌, సర్పంచ్‌ మేకల పోశక్క, ఎంఈవో జయరాజు ఆయాశాఖల అధికారులు పాల్గొని జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో ఆయా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 15 , 2026 | 11:23 PM