Share News

కుల రహిత సమాజానికి కృషి

ABN , Publish Date - Apr 05 , 2026 | 11:48 PM

జిల్లాలో బాబుజగ్జీవన్‌ రామ్‌ 119వ జయంతిని ఆదివారం ఘనంగా ని ర్వహించారు. నాగర్‌కర్నూల్‌లోని పాత కలెక్ట ర్‌ కార్యాలయం దగ్గర జిల్లా షెడ్యూల్డ్‌ కులా ల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాగర్‌కర్నూల్‌ ఎ మ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, కలెక్టర్‌ బదావత్‌ సం తోష్‌లు బాబు జగ్జీవన్‌రామ్‌ చిత్రపటా నికి పూల మాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు.

కుల రహిత సమాజానికి కృషి
నాగర్‌కర్నూల్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

- బాబుజగ్జీవన్‌రామ్‌ జయంతిలో కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

- పాల్గొన్న ఎమ్మెల్యేలు కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి, వంశీకృష్ణ

నాగర్‌కర్నూల్‌/ టౌన్‌/ అచ్చంపేట/ టౌన్‌/ కల్వకుర్తి/ బిజినేపల్లి/ తాడూరు/ వంగూరు/ ఊర్కొండ/ పెద్దకొత్తపల్లి/ కోడేరు/ పెంట్లవెల్లి/ తిమ్మాజిపేట/ ఉప్పునుంతల/ బ్రహ్మగిరి/ వెల్దండ/ లింగాల/ అమ్రాబాద్‌/ మన్ననూరు, ఏ ప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో బాబుజగ్జీవన్‌ రామ్‌ 119వ జయంతిని ఆదివారం ఘనంగా ని ర్వహించారు. నాగర్‌కర్నూల్‌లోని పాత కలెక్ట ర్‌ కార్యాలయం దగ్గర జిల్లా షెడ్యూల్డ్‌ కులా ల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాగర్‌కర్నూల్‌ ఎ మ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, కలెక్టర్‌ బదావత్‌ సం తోష్‌లు బాబు జగ్జీవన్‌రామ్‌ చిత్రపటా నికి పూల మాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కుల రహి త సమాజ నిర్మాణానికి కృషి చేసిన మ హనీయుడు డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌ అని తెలిపారు. సామాజిక న్యాయం, స మానత్వం కోసం అట్టడుగు వర్గాల తరపున అలుపెరుగని పోరాటం చేసి మహనీయుడని తెలిపారు.ఎమ్మెల్యే కూ చకుళ్ల రాజేష్‌రెడ్డి మా ట్లాడుతూ బాబు జగ్జీవ న్‌రామ్‌ జీవితం ప్రతీ ఒక్కరికి స్ఫూర్తిదాయ కమని పేర్కొన్నారు. ఆ యన ఆశయాలు స మాజాన్ని ముందుకు నడిపించే శక్తిగా నిలి చాయన్నారు. అచ్చంపే ట ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ జిల్లా కేం ద్రంలో ఇంటిగ్రేటెడ్‌ స్టడీ సర్కిల్‌ ఏర్పాట్లకు కృషి చేయనున్నట్లు తెలిపారు. కుల రహిత సమా జం కోసం ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి సార థ్యంలో ఇంటిగ్రేటెడ్‌ రె సిడెన్షియల్‌ పాఠశాల లు నెలకొల్పి అందులో అన్ని కులాల విద్యార్థు లకు అవకాశం కల్పిం చనున్నట్లు తెలిపారు. నాగర్‌కర్నూల్‌ ముని సిపల్‌ చైర్మన్‌ తీగల సునేంద్ర, షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ అధి కారి ఉమాపతి, దళిత సంఘాల నాయకులు కోళ్లశివ, వార్డెన్‌ చెన్నయ్య, వంకేశ్వరం ని రంజన్‌, వంకేశ్వరం మణెమ్మ, జెట్టి ధర్మ రాజు, గుట్ట విజయ్‌, ఎదిరేపల్లి కాశన్న, అంతటి కాశన్న, కొత్తపల్లి శివప్రసాద్‌, ప్రభాకర్‌, జానయ్య, కొత్త శ్రీనివాసులు, రమేష్‌ బహుదూర్‌, జెట్టి వెంకటేశ్‌, డాక్ట ర్‌ రమేష్‌చంద్ర, గుంపల్లి అశోక్‌, జయ శంకర్‌, చంటి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అన్ని మండలాల్లోనూ బా బూ జగ్జీవన్‌ రామ్‌ జయంతిని అధికా రులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘా ల నాయకులు ఘనంగా నిర్వహించారు.

Updated Date - Apr 05 , 2026 | 11:48 PM