సమ్మె విచ్ఛిన్నకర చర్యలు ఆపాలి
ABN , Publish Date - Apr 19 , 2026 | 11:26 PM
సమ్మె విచ్ఛిన్నకర చర్యలు ఆపాలని టీజీఆర్టీసీ ఎస్‌డ బ్ల్యూఎఫ్ రీజియన్ కార్యదర్శి వెంక టయ్య అన్నారు.
- టీజీఆర్టీసీ ఎస్‌డబ్య్లూఎఫ్ రీజియన్ కార్యదర్శి వెంకటయ్య
అచ్చంపేటటౌన్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి) : సమ్మె విచ్ఛిన్నకర చర్యలు ఆపాలని టీజీఆర్టీసీ ఎస్‌డ బ్ల్యూఎఫ్ రీజియన్ కార్యదర్శి వెంక టయ్య అన్నారు. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేష న్ ఆధ్వర్యంలో సమ్మె విచ్ఛిన్నకర చర్యలు ఆపా లని ఆదివారం పట్టణంలోని ఆర్డీసీ డిపో ముం దు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ విద్యుత్ బస్సులను నిర్వ హించేలా విఽధానంలో మార్పు చేసి కార్మికుల ఉద్యోగాలకు భద్రత కల్పించాలని వారు డిమా ండ్ చేశారు. సంస్థ కోసమే పని చేస్తున్న ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వ వైఖరి శత్రుపూరితంగా ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ సం ఘాలను చర్చలకు పిలిచి సమస్యలను పరి ష్కారం చేయాల న్నారు. లేదంటే ఈ నెల 23వ తేదీ నుంచి జరిగే సమ్మెను ఉధృతం చేస్తామని వారు హె చ్చరించారు. కార్యక్రమంలో సీఐటీ యూ జిల్లా నాయకులు పర్వతాలు, టీజీఆర్టీసీ ఎస్‌డబ్య్లూఎఫ్ నాయకులు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.