Share News

kumaram bheem asifabad-పక్కా పర్యవేక్షణ

ABN , Publish Date - Jul 26 , 2026 | 10:15 PM

రాష్ట్ర విద్యాశాఖ ప్రవేశపెట్టిన టీజీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ యాప్‌ ద్వారా పాఠశాలల్లో పారదర్శకతను పెంచేలా అధికారులు పక్కాగా పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక పై మరో లెక్క ఉపాధ్యాయులు డుమ్మా కొట్టినా, మధ్యాహ్న భోజనంలో అవకతవ కలకు పాల్పడినా, ఇతర అభివృద్ధి పనుల్లో ఏ మాత్రం తేడా వచ్చినా తెలుసుకునే అవకాశం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

kumaram bheem asifabad-పక్కా పర్యవేక్షణ
లోగో

కాగజ్‌నగర్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విద్యాశాఖ ప్రవేశపెట్టిన టీజీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ యాప్‌ ద్వారా పాఠశాలల్లో పారదర్శకతను పెంచేలా అధికారులు పక్కాగా పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక పై మరో లెక్క ఉపాధ్యాయులు డుమ్మా కొట్టినా, మధ్యాహ్న భోజనంలో అవకతవ కలకు పాల్పడినా, ఇతర అభివృద్ధి పనుల్లో ఏ మాత్రం తేడా వచ్చినా తెలుసుకునే అవకాశం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. టీజీ స్కూల్‌ ఎడ్యూకేషన్‌ యాప్‌ ప్రభుత్వ బడులు సమగ్ర విద్యా సమాచారాన్ని తెలుసుకోవడానికి రాష్ట్ర విద్యా శాఖ తాజాగా ఈ యాప్‌ను తీసుకొచ్చింది. ఈ వాట్సాప్‌తో విద్య సేవలను మరింత పారదర్శకంగా విస్తరిస్తోంది.

- విద్యార్థుల అభ్యసన స్థాయి..

ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన స్థాయి, మధ్యాహ్న భోజనం పథకం, ఏకరూపదుస్తులు, తల్లిదండ్రుల సమావేశాలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. ఆయా సమాచారంతో సేవలన్నీ డిజిటలైజ్‌ చేయడానికి స్కూల్‌ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వహ కులు, తల్లిదండ్రులు, విద్యార్ధుల మధ్య పారదర్శకత పెంచడం యాప్‌ ప్రధాన లక్ష్యం. యాప్‌ ఆధారంగా పాఠశాల అభివృద్ధి నిధులు, ఇతర రకాల సేవలు పరిగణలోకి తీసు కుంటారు. ఈ యాప్‌లో ప్రధానంగా 15 సేవలు అందుబాటులోకి రాను న్నాయి. విద్యార్థుల ఎఫ్‌ఎల్‌ఎన్‌, ఎల్‌ఐపీ(లీప్‌) బేస్‌లైన్‌ అసెస్‌మెంటు ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థుల నైపుణ్యాల పరిశీలన చేస్తారు. అక్షరాస్యత, సంఖ్యా జ్ఙానం నైపుణ్యాలను కూడా అంచనా వేస్తారు. వీటితో పాటు బడిబాట ప్రవేశాలు, విద్యార్థుల ప్రొఫైల్‌ సృష్టించడం, అప్‌డేట్‌ చేయడంలాంటివి చేయొచ్చు. మండల, జిల్లా స్థాయి అధికారులకు విద్యా ప్రగతి నివేదికలు నేరుగా అందిస్తోంది. విద్యార్థుల, తల్లిండ్రులు మార్కులు మెమోలు, హాల్‌టికెట్లు, బోనఫైడ్‌, ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికేట్‌ వాట్సప్‌లో డౌన్‌ చేసు కునే వెసులుబాటు ఉంటుంది. పరీక్షల సమాచారం, ఉపకార వేతనాలు, విద్యా సామగ్రి, పంపిణీ వివరాలు మొబైల్‌కు సమాచారం అందుతోంది. ఉపాధ్యాయుల వృత్యాంతర శిక్షణ సమయంలో ఉదయం హాజరు, సాయంత్రం అవుట్‌ టైం నమోదు చేస్తోంది.

పకడ్బందీగా అమలు చేస్తున్నాం..

- వాసాల ప్రభాకర్‌, కాగజ్‌నగర్‌ ఎంఈవో

టీజీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ యాప్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నాం. యాప్‌ నివేదిక ఆధారంగా నిర్వహణ కొనసాగుతోంది. మండలాల వారీగా ఎంఈవోలు, కాంప్లెక్సు ప్రధానో పాధ్యాయులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు యాప్‌పై అవగాహన కల్పిస్తాం. ప్రతి పాఠశాల సమగ్ర సమాచారం యాప్‌ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది.

Updated Date - Jul 26 , 2026 | 10:15 PM