Share News

kumaram bheem asifabad- పారదర్శకత పెంచేలా కఠిన నిబంధనలు

ABN , Publish Date - May 21 , 2026 | 10:19 PM

ఆపదలో ఉన్న పేదలకు కొండంత అండగా నిలిచే ముఖ్యమంత్రి సహాయనిధి నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. ప్రభుత్వం పారదర్శకత పెంచేలా సీఎంఆర్‌ఎఫ్‌ మఖ్యమంత్రి సహాయనిధి దరఖాస్తుల్లో మార్పులు తీసుకువచ్చింది. ఆపదలో ఉన్న పేదలకు కొండంత అండగా నిలిచే మఖ్యమంత్రి సహాయనిధి నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ముఖ్యంగా దుర్వినియోగాన్ని అడ్డుకోవడంతో పాటు పారదర్శకత పెంచే లక్ష్యంతో ధరఖాస్తు ప్రక్రియలో మార్పులు చేపట్టింది.

kumaram bheem asifabad- పారదర్శకత పెంచేలా కఠిన నిబంధనలు
లోగో

రెబ్బెన, మే 21 (ఆంధ్రజ్యోతి): ఆపదలో ఉన్న పేదలకు కొండంత అండగా నిలిచే ముఖ్యమంత్రి సహాయనిధి నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. ప్రభుత్వం పారదర్శకత పెంచేలా సీఎంఆర్‌ఎఫ్‌ మఖ్యమంత్రి సహాయనిధి దరఖాస్తుల్లో మార్పులు తీసుకువచ్చింది. ఆపదలో ఉన్న పేదలకు కొండంత అండగా నిలిచే మఖ్యమంత్రి సహాయనిధి నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ముఖ్యంగా దుర్వినియోగాన్ని అడ్డుకోవడంతో పాటు పారదర్శకత పెంచే లక్ష్యంతో ధరఖాస్తు ప్రక్రియలో మార్పులు చేపట్టింది. రెండేళ్లుగా కొనసాగుతున్న ఆన్‌లైన్‌ విదానాన్ని మరింత పకడ్బందీగా మారుస్తు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ఏ నియెజకవర్గానికి చెందిన వారికి అయినా మంత్రులు సిఫారసు చేసే వెసులు బాటు ఉండేది. తాజా మార్పుల ప్రకారం మంత్రులు లేదా ప్రజాప్రతినిధులు కేవలంవారి నియెజకవర్గాల పరిధిల నివసించే అభ్యర్ధులకు మాత్రమే సిఫారసు చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ ధరఖాస్తు సాఫ్ట్‌వేర్‌ లోనూ అభ్యర్థి చిరునామా ఆదారంగానే సిఫారసు చేసేలా మార్పులు చేశారు.

చెక్కులో తప్పులు ఉంటే..

గతంలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులో ఏవైనా తప్పులు దొర్లితే వాటిని సరిచేయడానికి మాన్యువల్‌ విదానం అమలులో ఉండేది. ఇకపై మార్పు ప్రక్రియను పూర్తిగా ప్రజాప్రతి నిధుల లాగిన్‌కు అనుసంధానించారు. లబ్ధిదారులు తమ నియెజకవర్గ ప్రజాప్రతినిధి కార్యాలయాన్ని ఆశ్రయిస్తే అక్కడి సిబ్బంది ఆన్‌లైన్‌ ద్వారా రెవెన్యూ విభాగానికి దరఖాస్లు పంపిస్తారు. తదనంతరం కొత్త చెక్కు నేరుగా ప్రజాప్రతినిధి కార్యాలయానికి చేరుతుంది. దరఖాస్తుదారులు ఇచ్చే వివరాలలో చిన్న తప్పు ఉన్నా ఆర్థిక సాయం అందడంలో జాప్యం జరుగుతుందని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రధానంగా మొబైల్‌ నంబర్‌ తప్పుగా ఇవ్వడం, బ్యాంకు ఖాతా వివరాలలో పొరపాట్లు, ఆధార్‌ సంఖ్య నమోదు అలసత్వం, భౌతిక పత్రాలను నిర్ణీత సమయంలో సమర్పించక పోవడం తదితర కారణాలతో చెక్కులు సకాలంలో లబ్ధిదారులకు చేరడం లేదని ప్రభుత్వం గుర్తించింది. ఈ వివరాలన్నీ పక్కగా ఉండేలా చూడాలని సూచించింది. మంత్రుల పాత్రను పరిమితం చేస్తూ స్థానిక ప్రజాప్రతినిధులకే పూర్తి బాధ్యత అప్పగించడం ద్వారా క్షేత్రస్థాయిలో నిజమైన బాధితులకు త్వరితగతిన న్యాయం జరుగతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Updated Date - May 21 , 2026 | 10:19 PM