kumaram bheem asifabad- గంజాయి రవాణాపై కఠిన చర్యలు
ABN , Publish Date - Jan 31 , 2026 | 11:25 PM
జిల్లాలో గంజాయి అక్రమ సాగు, రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీతకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో శనివారం అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీఎస్పీ వహీదుద్దీన్‌తో కలిసి మాదకద్రవ్యాల వినియోగం, నివారణ, గంజాయి అక్రమ సాగు, రవాణా నియంత్రణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గంజాయి అక్రమ సాగు, రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీతకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో శనివారం అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీఎస్పీ వహీదుద్దీన్‌తో కలిసి మాదకద్రవ్యాల వినియోగం, నివారణ, గంజాయి అక్రమ సాగు, రవాణా నియంత్రణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపాలని చెప్పారు. గంజాయి సాగు, రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకో వాలని తెలిపారు. గంజాయి సాగు చేసే వారికి ప్రభుత్వ పథకాలు వర్తించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. వాహనదారులు, ఆటో డ్రైవర్లు, విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. కళాజాతా బృందాలచే గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాల న్నారు. అటవీ శాఖ, పోలీసు శాఖల అధికారులు నిఘా మరింత పటిష్టం చేయాలని తెలిపారు. సరిహధ్దు ప్రాంతాల నుంచి రవాణా అయ్యే అవకాశం ఉన్నందున విస్తృత స్థాయి తనిఖీలు చేపట్టాలని సూచించారు. అనంతరం నషా ముక్త్ భారత్ అభియాన్ గోడ ప్రతులను ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా సంక్షేమాధికారి భాస్కర్, గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, మైనార్టీ సంక్షేమాధి కారి నదీం, ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతికిరణ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సీతారాం, జిల్లా వ్యవసాయాధికారి వెంకటి తదితరులు పాల్గొన్నారు.
పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించాలి
ఆసిఫాబాద్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహిం చాలని జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో శనివారం పరిశ్రమలు, గనులు, భూగర్భనీటి వనరులు, బ్యాంక్, విద్యుత్, గిరిజన సంక్షేమ శాఖల అధికారులతో పరిశ్రమల స్థాపన, ప్రోత్సాహకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులకు ఔత్సాహికులు పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేలా అధికారులు కృషి చేయాలని తెలిపారు. ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకం ద్వారా 18 రకాల చేతి వృత్తుల వారికి ఆర్థిక సహాయంగా రుణ సదుపాయం కల్పించనున్నామని అన్నారు. చేతి వృత్తుల కళాకా రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జిల్లాలోని జిన్నింగ్ మిల్లులు, రైస్ మిల్లు ఏర్పాటు ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగు పర్చచవచ్చని చెప్పారు. ఈ అంశాలపై ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిం చాలని సూచించారు. పరిశ్రమల స్థాపనకు అధికారులు తోడ్పాటు అందించాలని తెలిపారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మేనేజర్ అశోక్ పాల్గొన్నారు.