kumaram bheem asifabad-ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - May 30 , 2026 | 11:49 PM
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కెహరిత అన్నారు. జిల్లాలోని కెరమెరి మండలం కోటారి కొత్తగూడ గ్రామానికి సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్న సందర్భంగా శనివారం అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, గృహ నిర్మాణ శాఖ పీడీ ప్రకాష్‌రావులతో కలిసి ఏర్పాట్లను ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లను చక్కగా అలంకరించాలని, గ్రామస్తులతో సహపంక్తి భోజనంతో పాటు లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం ఉన్నందున సమావేశ వేదిక వద్ద పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలన్నారు.
కెరమెరి, మే 30 (ఆంధ్రజ్యోతి):ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కెహరిత అన్నారు. జిల్లాలోని కెరమెరి మండలం కోటారి కొత్తగూడ గ్రామానికి సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్న సందర్భంగా శనివారం అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, గృహ నిర్మాణ శాఖ పీడీ ప్రకాష్‌రావులతో కలిసి ఏర్పాట్లను ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లను చక్కగా అలంకరించాలని, గ్రామస్తులతో సహపంక్తి భోజనంతో పాటు లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం ఉన్నందున సమావేశ వేదిక వద్ద పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలన్నారు. హెలిప్యాడ్ నుంచి గ్రామంలో వచ్చే దారిలో స్వాగత తోరణాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. పారిశుధ్య పనులను ఎప్పటికప్పుడు చేపట్టాలని తెలిపారు. ముఖ్యమంత్రి, మంతులకు ఘనంగా స్వాగతం పలికేలా అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.
విజయవంతం చేయాలి
జిల్లాలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన ఉన్నందున కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవనంలోని పాలనాధికారి చాంబర్ నుంచి జిల్లా అధికారులు, తహపసీల్దార్‌లు, ఎంపీడీఓలు, ఇతర అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్1న జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం పర్యనలో ఎలాంటి పొరపాట్లు లేకుండా విజయవంతం చేసే దిశగా అధికారులు సపమన్వయంతో పని చేయాలని తెలిపారు. అధికారులకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా న్విహించాలని, విధులలో అలసత్వం లేకుండా ఏర్పాటు చేయాలని తెలిపారు. కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్డు వద్ద నిర్వహించే బహిరంగ సభకు మహిళా సంఘాల సభ్యులను తరలించాలని, మహిళలను బస్సులలో తీసుకు రావాలని, ప్రతి బస్సుకు ఇద్దరు సిబ్బందిని ఇన్‌చార్జిలుగా నియమించాలని, తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకేట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రజలు సభా స్థలికి చేరుకునేలా చర్యలు తీసుకోవవాలని, బస్సులో వచ్చేటప్పుడు ఎండ తీవ్రత దృష్ట్యా రక్షణ చర్యలు తీసుకోవాలని, సభ అనంతరం తిరిగి గ్రామాలకు చేరుకునే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలన్నారు. అధికారులకు సమన్వయంతో పని చేసి బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, పంచాయతీ అధికారి భిక్షపతి, జడ్పీ సీఈఓ లక్ష్మినారాయణ, గృహ నిర్మాణ శాఖ పీడీ ప్రకాష్‌రావు తదితరులు పాల్గొన్నారు.